Telugu Global
Cinema & Entertainment

Ramcharan Upasana: తండ్రి కాబోతున్న చరణ్

Ramcharan: రాంచరణ్ తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడించాడు.

Ramcharan Upasana: తండ్రి కాబోతున్న చరణ్
X

హీరో రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు. రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ విషయాన్ని చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ అధికారికంగా ప్రకటించారు.


రామ్ చరణ్, ఉపాసన పెళ్లి చేసుకొని పదేళ్లు అవుతోంది. కానీ ఇప్పటివరకు వాళ్లు పిల్లల్ని ప్లాన్ చేసుకోలేదు. అడిగితే అది తమ వ్యక్తిగతం అని తెలిపారు. పిల్లల కోసం మానసికంగా తాము సిద్ధం కాలేదని గతంలో ప్రకటించారు.


ఇదే అంశంపై అప్పట్లో చిరంజీవి కూడా స్పందించారు. రామ్ చరణ్ తండ్రి అయితే చూడాలని ఉందని, మనవడు లేదా మనవరాల్ని ఎత్తుకొని ఆడుకోవాలని ఉందంటూ తన మనసులో మాట బయటపెట్టారు.


ఇన్నాళ్లకి అందరి నిరీక్షణ ఫలించింది. ఉపాసన గర్భందాల్చింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా చిరంజీవి, ఇనస్టాగ్రామ్ వేదికగా రామ్ చరణ్ స్పందించారు.

First Published:  12 Dec 2022 2:03 PM GMT
Next Story