Telugu Global
Cinema & Entertainment

Operation Raavan: హీరో రక్షిత్ నుంచి మరో డిఫరెంట్ మూవీ

Operation Raavan movie first look: రక్షిత్ నటిస్తున్న ఆపరేషన్ రావణ్ మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది

Operation Raavan: హీరో రక్షిత్ నుంచి మరో డిఫరెంట్ మూవీ
X

'పలాస 1978' లాంటి పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ తో హిట్ కొట్టాడు హీరో రక్షిత్. ఇప్పుడీ హీరో నుంచి మరో డిఫరెండ్ మూవీ రాబోతోంది.

న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా కొత్త చిత్రం "ఆపరేషన్ రావణ్"లో రక్షిత్ అట్లూరి హీరోగా, సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటించారు. ఈ

చిత్రంలో సీనియర్ నటి రాధికా శరత్ కుమార్, నటుడు చరణ్ రాజ్, తమిళ నటుడు విద్యా సాగర్ ప్రముఖ పాత్రలు పోషించారు. ఈ చిత్రంతో వెంకట సత్య దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.


'నీ ఆలోచనలే నీ శత్రువులు' అనే కాప్షన్ తో రక్షిత్ ఉన్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ని తాజాగా లాంచ్ చేశారు. ఈ టైటిల్ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ సినిమా. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.


ఈ సినిమాకు ఆపరేషన్ రావణ్ అనే టైటిల్ పెట్టడం వెనక సస్పెన్స్ దాగుందని అంటున్నారు మేకర్స్. త్వరలోనే టీజర్ రిలీజ్ అవుతుందని, అందులో హీరో పాత్రకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుస్తాయని చెబుతున్నారు. టీజర్ రిలీజ్ సందర్భంగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు.


శరవణ వాసుదేవన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటివరకు తెలుగులో ఇలాంటి కథ రాలేదంటున్నారు మేకర్స్. రక్షిత్ కూడా పలాస తర్వాత తనకు హిట్టిచ్చే మూవీ ఇదే అవుతుందనే కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు.

First Published:  27 Jan 2023 1:55 PM GMT
Next Story