Telugu Global
Cinema & Entertainment

Super Star Krishna: కృష్ణ మరణంపై రజనీకాంత్ దిగ్భ్రాంతి

Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ మృతిపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు అని విచారం వ్యక్తం చేశారు.

Super Star Krishna: కృష్ణ మరణంపై రజనీకాంత్ దిగ్భ్రాంతి
X

సూపర్ స్టార్ కృష్ణ మృతిపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు అని విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేస్తూ..'కృష్ణ గారితో మూడు సినిమాల్లో కలిసి నటించాను.అవి ఎప్పటికీ మధుర జ్ఞాపకాలు. కృష్ణ ఆత్మకు శాంతి కలగాలి. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను' అని రజనీ ట్వీట్ చేశారు.



రజనీకాంత్ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో తమిళ్ తో పాటు తెలుగు, కన్నడలో పలు సినిమాల్లో నటించారు. ఆ సమయంలోనే కృష్ణ గారితో రజనీ మూడు సినిమాల్లో నటించారు. కృష్ణ, రజనీకాంత్ కలిసి నటించిన తొలి సినిమా అన్నదమ్ముల సవాల్. కేఎస్ ఆర్ దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో సూపర్ హిట్ అయింది.

అలాగే వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రం ఇద్దరు అసాధ్యులే. ఇందులో కృష్ణ, రజనీ బావ బామ్మర్దులుగా నటించగా..ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.కృష్ణ, రజనీకాంత్ హీరోలుగా కలసి నటించిన మూడో చిత్రమైన రామ్ రాబర్ట్ రహీమ్ కు విజయ నిర్మల దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.

First Published:  15 Nov 2022 6:03 AM GMT
Next Story