Telugu Global
Cinema & Entertainment

C Kalyan: పవన్ ఆ సినిమా చేస్తే చరిత్ర అయ్యేది

Godse Movie: సత్యదేవ్ హీరోగా నటించిన సినిమా ఇది. ఈ మూవీ ఫ్లాప్ అవ్వడానికి కారణం బయటపెట్టాడు నిర్మాత సి.కల్యాణ్

C Kalyan: పవన్ ఆ సినిమా చేస్తే చరిత్ర అయ్యేది
X

రీసెంట్ గా గాడ్సే సినిమాను రిలీజ్ చేశాడు నిర్మాత సి.కల్యాణ్. ఆ సినిమా థియేటర్లలో ఫ్లాప్ అయింది. ఓటీటీలో కూడా దానికి ఆదరణ అంతంత మాత్రంగానే దక్కింది. ఇప్పుడా సినిమా ఫలితంపై స్పందించాడు ఈ నిర్మాత.

"మంచి సినిమా చేయాలని గాడ్సే తీశాం. అది మంచి సినిమానే. చాలా బాగా వచ్చింది. అయితే ప్రేక్షకులు ఓటీటీలో చూసినంతగా థియేటర్లో చూడలేదు. అయితే ఆ సబ్జెక్ట్ ని మోయగలిగే ఆర్టిస్ట్ కావాలి. ఈ సంగతి దర్శకుడికి ముందే చెప్పాను. అయితే అప్పటికే హీరోని ఫిక్స్ అయిపోయి ఉన్నాం. ఆ సబ్జెక్ట్ ని మోయగలిగేది తెలుగులో ఇద్దరే. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్. వీళ్లలో ఎవరు చేసినా గాడ్సే ఒక చరిత్ర సృష్టించేది. పిల్లల్ని చదివించి, వారికీ ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్న తల్లితండ్రులందరికీ ఇది రీచ్ అవుతుందని భావించాం. కానీ కుదరలేదు. ఇదొక్కటే బాధ వేసింది. అయితే ఈ సినిమా ఎక్కడా రాజీపడకుండా తీశాం. ఎక్కడా వెనకడుగు వేయలేదు. సత్యదేవ్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో చేసిన సినిమా గాడ్సే. అయితే సినిమాలో డబ్బు పొతే పోయిందని అనుకోను. సినిమా ఇచ్చిన డబ్బుని అదే తీసుకెళ్ళిందని భావిస్తాను."

ఇలా గాడ్సే ఫ్లాప్ పై స్పందించాడు సి.కల్యాణ్. ఈ సినిమా ఫెయిల్ అవ్వడానికి ప్రచారం చేయకపోవడం కూడా ఓ కారణం అన్నాడు. అయితే ప్రమోషన్ విషయంలో తన తప్పు లేదని, సత్యదేవ్ సహకరించకపోవడం వల్లనే ప్రచారం చేయలేకపోయామని అన్నాడు.

గాడ్సే ప్రచారం కోసం కోటిన్నర కేటాయించాడట సి.కల్యాణ్. ఆ కోటిన్నరతో తెలుగు రాష్ట్రాల్లో టూర్ చేయాలనేది అతడి ఆలోచన. అయితే సత్యదేవ్ మాత్రం తనకు ఖాళీ లేదని, గుంటూరు వరకు వెళ్లి వెనక్కి వస్తానని అన్నాడట. దీంతో ఆ టూర్ ను క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు కల్యాణ్.




First Published:  9 Dec 2022 3:57 AM GMT
Next Story