Telugu Global
Cinema & Entertainment

Premikudu | మళ్లీ థియేటర్లలోకి ప్రేమికుడు

Premikudu - ప్రభుదేవాను హీరోగా మార్చిన సినిమా ప్రేమికుడు. శంకర్ డైరక్ట్ చేసిన ఈ సినిమా మళ్లీ థియేటర్లలోకి వస్తోంది.

Premikudu | మళ్లీ థియేటర్లలోకి ప్రేమికుడు
X

అలనాటి బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమికుడు మరోసారి థియేటర్లలోకి వస్తోంది. శంకర్ డైరక్ట్ చేసిన ఈ సినిమాతోనే ప్రభుదేవా హీరోగా మారాడు. రెహ్మాన్ అందించిన సంగీతం ఈ సినిమాను నిలబెట్టగా.. కేటీ కుంజుమన్ భారీ నిర్మాణ విలువలు ప్రేమికుడు సినిమాను బ్లాక్ బస్టర్ గా మార్చాడు.

ప్రభుదేవా-నగ్మా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను రీ-రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా రిలీజ్ నిర్మాతలుగా రమణ, మురళీధర్ వ్యవహరిస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రలో నటించిన ఈ సినిమాను మరోసారి వెండితెరపై చూసే అవకాశం కల్పిస్తున్నారు.

30 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రేమికుడు సినిమా మళ్లీ ఇన్నేళ్లకు రీ-రిలీజ్ అవుతోంది. ప్రభుదేవా డాన్స్ చూసి స్ప్రింగ్ లు మింగాడా అనుకునేవాళ్లు జనం. ఒక మంచి ప్రేమ కథ గా సెన్సేషన్ సృష్టించిన సినిమా, కథ-డాన్స్-మ్యూజిక్-డైరక్షన్-సెట్స్.. ఇలా అన్ని విభాగాల్లో ఆకట్టుకుంది.

సినిమా రీ-రిలీజ్ సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ తరంలో ఈ సినిమా రిలీజ్ అయి ఉంటే కచ్చితంగా 100 కోట్లు కొల్లగొట్టేదంటూ అంతా అభిప్రాయపడ్డారు. ఈ సినిమాకు ప్రత్యేకంగా ట్రయిలర్ రిలీజ్ చేయడంతో పాటు, ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కూడా గ్రాండ్ గా చేయబోతున్నారు. త్వరలోనే సినిమా రీ-రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారు.

First Published:  18 March 2024 5:35 PM GMT
Next Story