Telugu Global
Cinema & Entertainment

Prema Vimanam: నేరుగా ఓటీటీలోకి మరో సినిమా

Prema Vimanam First Look released: సంగీత్ శోభన్ హీరోగా నటించిన వెబ్ ఫిలిం ప్రేమ విమానం. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది.

Prema Vimanam: నేరుగా ఓటీటీలోకి మరో సినిమా
X

గూఢచారి, రావణాసుర వంటి సినిమాలను నిర్మించిన అభిషేక్ పిక్చర్స్ ఇప్పుడు ఓ వెబ్ ఫిల్మ్‌ను నిర్మించింది. అభిషేక్ పిక్చర్స్, జీ5 సంయుక్తంగా నిర్మిస్తోన్న ప్రేమ విమానం అనే వెబ్ ఫిల్మ్ ఫస్ట్ లుక్‌ను తాజాగా విడుదల చేశారు.

ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అన్ని ప్రధాన పాత్రధారులను పరిచయం చేశారు. ఇద్దరు పిల్లలు (దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా), హీరో హీరోయిన్లు (సంగీత్ శోభన్, శాన్వీ మేఘన), వెన్నెల కిషోర్, అనసూయ భరద్వాజ్ ఇలా అందరూ కూడా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కనిపిస్తున్నారు.

ఎలాగైనా సరే విమానం ఎక్కాలని ప్రయత్నించే ఇద్దరు పిల్లలు, అర్జెంట్‌గా ఫ్లైట్ ఎక్కి తమ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ప్రేమ జంట ఇలా అందరినీ ఒకే చోటకు చేర్చుతుంది కథ. ఇక వీరి ప్రయాణంలో వచ్చే మలుపులు, సంతోషాలు, బాధలు, నవ్వులు ఇలా అన్నీ కూడా ప్రేక్షకులను మెప్పించేలా ఉంటాయి.

ఈ వెబ్ ఫిల్మ్‌కి సంతోష్ కటా దర్శకత్వం వహించగా.. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించాడు. జగదీష్ చీకటి కెమెరామెన్‌గా పని చేశాడు. ఇందులో వెన్నెల కిషోర్, అనసూయ కూడా నటించారు. త్వరలోనే ఈ వెబ్ మూవీ జీ5లో స్ట్రీమింగ్ కు రాబోతోంది.




First Published:  20 April 2023 1:27 AM GMT
Next Story