Telugu Global
Cinema & Entertainment

Salaar Trailer | అప్పుడు కేజీఎఫ్.. ఇప్పుడు ఖన్సార్

Salaar Trailer - మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ సలార్ నుంచి ఎట్టకేలకు ట్రయిలర్ రిలీజైంది. ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Salaar Trailer | అప్పుడు కేజీఎఫ్.. ఇప్పుడు ఖన్సార్
X

కేజీఎఫ్ పేరిట ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించిన ప్రశాంత్ నీల్, ఈసారి ప్రభాస్ కోసం మరో ప్రపంచాన్ని క్రియేట్ చేశారు. అప్పుడు కేజీఎఫ్, ఇప్పుడు ఖన్సార్. ఓ ఊహా ప్రపంచంలో లార్జర్ దేన్ లైఫ్ స్టోరీని చూపించబోతున్నాడు ఈ దర్శకుడు. అదే సలార్.

సలార్ ట్రయిలర్ రిలీజైంది. అందరి అంచనాల్ని అందుకునేలా ఉంది ట్రయిలర్. ఈసారి ప్రభాస్, పూర్తిస్థాయిలో యాక్షన్ అందించబోతున్నాడనే విషయాన్ని సలార్ ట్రయిలర్ స్పష్టం చేసింది.

ట్రయిలర్ లో ఎలాంటి దాగుడుమూతల్లేవు. స్టోరీ ఏంటనేది క్లియర్ గా చెప్పేశారు. ఇద్దరు ప్రాణస్నేహితులు. ఓ స్నేహితుడిగా పృధ్వీరాజ్, మరో స్నేహితుడిగా ప్రభాస్. పృధ్వీరాజ్ కోసం ప్రభాస్ యుద్ధం మొదలుపెడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది స్టోరీ.

చిన్నప్పట్నుంచి ప్రాణస్నేహితులుగా పెరిగిన ప్రభాస్-పృధ్వీరాజ్, ఓ స్టేజ్ కు వచ్చేసరికి విరుద్ధ భావాలు కలిగి ఉంటారనే విషయాన్ని ట్రయిలర్ లో చూపించారు. మరీ ముఖ్యంగా చివర్లో ప్రభాస్ ను సంకెళ్లతో బంధించినట్టు చూపించి, మరింత ఆసక్తి రగిల్చారు.

ట్రయిలర్ అంతా బాగున్నప్పటికీ, టీజర్ లో కనిపించినట్టుగానే ఇందులో కూడా కేజీఎఫ్ ఛాయలు కనిపించాయి. అందులో ఓ సామ్రాజ్యం, ఇందులో కూడా ఓ సామ్రాజ్యం. అందులో కుర్చీ కోసం పోటీపడినట్టే, ఇందులో కూడా కుర్చీ కోసం పోటీ నడిచింది. సెట్, సెటప్ అంతా కేజీఎఫ్ ను పోలినట్టుంది. చివరికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అక్కడక్కడ కేజీఎఫ్ ను గుర్తుచేసింది.

ఈ సంగతి పక్కనపెడితే, చాన్నాళ్ల తర్వాత ప్రభాస్ ను యాక్షన్ మేకోవర్ లో చూస్తున్నారు జనం. ట్రయిలర్ లో హీరో డైలాగ్ అదిరింది. దీంతో థియేటర్లలో బొమ్మ కోసం వెయిటింగ్ మరింత పెరిగింది.

First Published:  1 Dec 2023 4:29 PM GMT
Next Story