Telugu Global
Cinema & Entertainment

Salaar | ప్రభాస్ సినిమా ఇంగ్లిష్ లో వస్తుందా?

Salaar English Version - ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సినిమా సలార్. ఈ సినిమాకు హాలీవుడ్ వెర్షన్ కూడా రెడీ చేస్తున్నారంట.

Prabhass Salaar Movie: మరో నెల రోజుల్లో సలార్ పూర్తి
X

Prabhas's Salaar Movie: మరో నెల రోజుల్లో సలార్ పూర్తి

సలార్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ అంతా వెయిటింగ్. వచ్చే నెలలో సినిమా ఉంది. టీజర్ కు ఆల్రెడీ పెద్ద రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కొలిక్కి వచ్చాయి. ఈ క్రమంలో మరో బిగ్ న్యూస్ బయటకొచ్చింది.

సలార్ సినిమాను హాలీవుడ్ వెర్షన్ లో కూడా రిలీజ్ చేస్తారంట. అంటే సినిమాలో పాటలు కట్ చేసి, నిడివి తగ్గించి, ఇంగ్లిష్ వెర్షన్ కు మార్చి విడుదల చేస్తారంట. ప్రభాస్ నుంచి ఓ సినిమా ఇంగ్లిష్ లో రిలీజ్ అవ్వడం ఇదే తొలిసారి.

అయితే తెలుగు వెర్షన్ తో పాటు, ఇంగ్లిష్ కాపీ రిలీజ్ అవ్వడం లేదు. సెప్టెంబర్ 28న తెలుగు, హిందీ, తమిళ్ తో పాటు పలు భారతీయ భాషల్లో సలార్ పార్ట్-1 రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 13న ఈ సినిమా ఇంగ్లిష్ వెర్షన్ ను విడుదల చేస్తారు.

కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది సలార్ సినిమా. సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ ఏడాది రిలీజ్ అవుతున్న అతిభారీ చిత్రాల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది సలార్ మూవీ.

First Published:  3 Aug 2023 4:28 AM GMT
Next Story