Telugu Global
Cinema & Entertainment

Salaar 2 | సలార్-2కు అంతా సిద్ధం

Prabhas's Salaar 2 - సలార్-2 షూటింగ్ కు రంగం సిద్ధమైంది. ఆర్ఎఫ్సీలో మొదటి షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.

Salaar 2 | సలార్-2కు అంతా సిద్ధం
X

సాలార్‌తో హిట్ కొట్టిన ప్రభాస్, ఇప్పుడు కల్కి తో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమౌతున్నాడు. ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా షూటింగ్ పూర్తయింది. అయితే ప్రభాస్ ఎక్కువ విరామం తీసుకునేట్టు కనిపించడం లేదు. ఈ నెల్లోనే సలార్-2 షూటింగ్ ప్రారంభించనున్నాడు ప్రభాస్.

హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో సలార్ 2 షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. దీనికి సంబంధించి భారీ సెట్ వేశారు. మొదటి షెడ్యూల్ 10 రోజుల పాటు సాగుతుంది. ఇందులో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ పాల్గొంటారు.

సలార్ మొదటి భాగానికి ప్రేక్షకుల నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ ను పరిగణనలోకి తీసుకుని.. పార్ట్-2 కోసం భారీ మార్పుచేర్పులు చేశాడు ప్రశాంత్ నీల్.

2025 డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావాలని టీమ్ ప్లాన్ చేస్తున్నారు. సీక్వెల్ కోసం భారీ కాస్టింగ్ ను తీసుకుంటున్నారు. త్వరలోనే ఈ సెట్స్ లోకి శృతిహాసన్ కూడా వచ్చి చేరుతుంది.

First Published:  1 May 2024 8:56 AM GMT
Next Story