Telugu Global
Cinema & Entertainment

మరింత ఊపందుకున్న రీ-రిలీజ్ సంస్కృతి

ప్రస్తుతం టాలీవుడ్ లో రీ-రిలీజ్ సంస్కృతి నడుస్తోంది. పవన్, చిరు, బాలయ్య పాత చిత్రాలు రీ-రిలీజ్ అయ్యాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి ప్రభాస్ కూడా చేరాడు.

మరింత ఊపందుకున్న రీ-రిలీజ్ సంస్కృతి
X

ఆమధ్య పవన్ కల్యాణ్ హీరోగా నటించిన పాత సినిమాలు కొన్ని రీ-రిలీజ్ అయ్యాయి. మంచి వసూళ్లు రాబట్టాయి. ఆ తర్వాత చిరంజీవి సినిమా కూడా ఒకటి రీ-రిలీజ్ అయింది. తాజాగా బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి సినిమా కూడా రీ-రిలీజ్ అయి భారీ వసూళ్లు అందుకుంది. ఇప్పుడీ లిస్ట్ లోకి ప్రభాస్ కూడా చేరాడు.

ఇది ప్రభాస్ పుట్టినరోజు సీజన్. ఈ నెలలో ప్రభాస్ పుట్టినరోజు ఉంది. అయితే కృష్ణంరాజు మరణంతో ఈసారి వేడుకలకు దూరంగా ఉంటున్నాడు ఈ నటుడు. కానీ ప్రభాస్ దూరమైనా, అభిమానులు మాత్రం అతడి పుట్టినరోజును భారీ ఎత్తున జరపాలని నిర్ణయించుకున్నారు. దీని కోసం ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న రి-రిలీజ్ కల్చర్ ను ఫాలో అవుతున్నారు.

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అతడు నటించిన 3 సినిమాల్ని ఒకేసారి రీ-రిలీజ్ చేయాలని నిర్ణయించారు. బాగా ఆలోచించి వర్షం, బిల్లా, రెబల్ సినిమాల్ని రీ-రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు సినిమాను 4కే ఫార్మాట్ లోకి మార్చే పనులు ఊపందుకున్నాయి.

ప్రభాస్ బర్త్ డేకి ఆదిపురుష్, సలార్ సినిమాల నుంచి అప్ డేట్స్ వస్తున్నాయి. వాటికి అదనంగా ఈ రీ-రిలీజ్ ల హంగామా కూడా ఉండబోతోంది ఈసారి. రెబల్ సినిమా పెద్దగా ఆడలేదు. కాకపోతే అందులో ప్రభాస్ మాస్ ఎలివేషన్స్ ఫ్యాన్స్ కు బాగా ఇష్టం.

First Published:  9 Oct 2022 8:22 AM GMT
Next Story