Telugu Global
Cinema & Entertainment

తొలిసారి ఖాకీ దుస్తుల్లో ప్రభాస్

ఈ మూవీలో ప్రభాస్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నట్లు తెలిపారు.

తొలిసారి ఖాకీ దుస్తుల్లో ప్రభాస్
X

ఆరడుగుల హీరో ప్రభాస్. మాస్ చిత్రాలకు సరిగ్గా సూటయ్యే కటౌట్ ఆయనది. మంచి ఫిజిక్ ఉన్నప్పటికీ ఎందుకో ప్రభాస్ ఒక్కసారి కూడా పోలీస్ గెటప్ లో కనిపించలేదు. ప్రభాస్ పోలీస్ గా మాంచి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ చేయాలని అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు.

అయితే అభిమానుల కల సందీప్ వంగా చిత్రంతో నెరవేరనుంది. ప్రభాస్ - సందీప్ కాంబినేషన్లో స్పిరిట్ అనే సినిమాను కొన్ని నెలల కిందట అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ పోలీస్ అధికారిగా కనిపిస్తారని ఒక ప్రచారం జరుగగా, స్పిరిట్ హర్రర్ కథాంశంతో తెరకెక్కుతుందని మరో ప్రచారం జరిగింది.

కాగా, ఈ ప్రచారంపై సందీప్ వంగా తాజాగా క్లారిటీ ఇచ్చారు. స్పిరిట్ హర్రర్ స్టోరీ తో తీస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. ఈ మూవీలో ప్రభాస్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు మరో రెండు అప్డేట్లను సందీప్ వెల్లడించారు. ప్రస్తుతం స్పిరిట్ స్క్రిప్ట్ పనులతో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నట్లు చెప్పారు.

ఈ ఏడాది ఆఖరు నుంచి స్పిరిట్ షూటింగ్ ప్రారంభం అవుతుందని సందీప్ వంగా తెలిపారు. ప్రస్తుతం ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898ఏడీ, మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ అనే సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లనుంది.

First Published:  1 March 2024 10:29 AM GMT
Next Story