Telugu Global
Cinema & Entertainment

Pooja Hegde | ఓటీటీలోకి అడుగుపెట్టబోతున్న పూజా హెగ్డే

Pooja Hegde - ప్రస్తుతం పూజాహెగ్డే ఖాళీగా ఉంది. ఇప్పుడీ ముద్దుగుమ్మ ఓటీటీలోకి అడుగుపెట్టే ఆలోచనలో ఉంది.

Pooja Hegde | ఓటీటీలోకి అడుగుపెట్టబోతున్న పూజా హెగ్డే
X

సడెన్ గా ఖాళీ అయిపోయింది పూజాహెగ్డే. ఆమె చేతిలో ఇప్పుడు సినిమాల్లేవు. వరుస ఫ్లాపులు పూజాహెగ్డే కెరీర్ ను దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో ఆమె ఓటీటీలో అడుగుపెడుతోంది. కొత్త ఉపాధి మార్గాన్ని వెదుక్కుంటోంది.

సౌత్‌లో రీఎంట్రీ కోసం ఎదురుచూస్తోన్న పూజాహెగ్డే తాజాగా ఓ బోల్డ్ మూవీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. లేడీ ఓరియెంటెడ్ మూవీగా రాబోతున్న ఈ సినిమాకు కోబ్రా దర్శకుడు, అజయ్ జ్ఞానముత్తు డైరక్ట్ చేయబోతున్నాడు.

డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ మూవీలో పూజా హెగ్డే క్యారెక్ట‌రైజేష‌న్‌, లుక్, చాలా బోల్డ్ గా ఉంటాయట. అందుకే ఈ సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కు పెడతారంట. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ తో ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది.

టాలీవుడ్‌కు దూర‌మైన పూజాహెగ్డే ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో షాహిద్‌క‌పూర్‌తో దేవా సినిమా చేస్తోంది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ 2024 అక్టోబ‌ర్‌లో రిలీజ్ కానుంది. తెలుగులో ఆమె గుంటూరుకారం సినిమా మిస్సయింది. అప్పట్నుంచి ఆమె కెరీర్ లో గ్యాప్ వచ్చేసింది.

First Published:  26 Dec 2023 5:05 PM GMT
Next Story