Telugu Global
Cinema & Entertainment

Peddha Kapu-1 | రేపే థియేట్రికల్ ట్రయిలర్ రిలీజ్

Peddha Kapu-1 - శ్రీకాంత్ అడ్డాల డైరక్ట్ చేసిన పెదకాపు-1 సినిమా ట్రయిలర్ రేపు రిలీజ్ అవుతుంది.

Peddha Kapu-1 | రేపే థియేట్రికల్ ట్రయిలర్ రిలీజ్
X

విరాట్ కర్ణ హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు-1’. ఈ సినిమా విడుదల తేదీ సమీపిస్తోంది. ‘అఖండ’తో బ్లాక్‌బస్టర్‌ అందించిన ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ పెద్ద హిట్టయింది. అలా సక్సెస్ ఫుల్ గా ఈ సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఇదే ఊపులో మరో క్రేజీ అప్ డేట్ ఇచ్చింది యూనిట్. రేపు పెదకాపు ట్రయిలర్ ను విడుదల చేయనుంది.

పెద కాపు-1 అణచివేత, ఘర్షణల నేపథ్యంలో సాగే సినిమా అని ఇప్పటికే ప్రకటించారు. ట్రైలర్‌లో సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలియనున్నాయి. గ్రామీణ నేపథ్యంలో సాగే పొలిటికల్ మూవీ ఇది.

ఈ చిత్రానికి ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇండియన్ లీడింగ్ యాక్షన్ డైరెక్టర్ పీటర్ హెయిన్స్ ఈ సినిమాకు ఫైట్స్‌ కంపోజ్ చేస్తున్నాడు. రావు రమేష్, నాగబాబు, తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, అనుసూయ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాపై క్రమక్రమంగా అంచనాలు పెరుగుతున్నాయి.

First Published:  10 Sep 2023 4:27 PM GMT
Next Story