Telugu Global
Cinema & Entertainment

HariHara Veeramallu - పవన్ సినిమా షూటింగ్ అప్ డేట్స్

HariHara Veeramallu - మరోసారి హరిహర వీరమల్లు సినిమాపై ఫోకస్ పెట్టాడు పవన్ కల్యాణ్. ఈ నెలలోనే కొత్త షెడ్యూల్ ఉండే అవకాశం ఉంది.

HariHara Veeramallu - పవన్ సినిమా షూటింగ్ అప్ డేట్స్
X

వినోదాయ శితం రీమేక్ రాకతో హరిహర వీరమల్లు సినిమాకు మరోసారి బ్రేక్ పడింది. అలా దాదాపు నెల రోజులుగా ఆగిపోయిన ఈ సినిమా, ఇప్పుడు మరోసారి తెరపైకొచ్చింది.

అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ నెల 11వ తేదీ నుంచి హరిహర వీరమల్లు కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. దీని కోసం నెల రోజుల కిందట వేసిన సెట్ అలానే ఉంది. ఇక తాజా షెడ్యూల్ లో.. క్లైమాక్స్ కి ముందు వచ్చే ఓ సీక్వెన్స్ ను షూట్ చేయబోతున్నారు.

ఈ షెడ్యూల్ లో బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహి కనిపించబోతుందని తెలుస్తోంది. ఆమె పాత్ర నెగిటివ్ షేడ్స్ తో ఉంటుందట, పైగా సినిమాలో కీలకం అంట. ఔరంగజేబు పాత్ర పోషిస్తున్న బాబి డియోల్ కు నోరాకు సంబంధం ఉంటుంది.

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది హరిహర వీరమల్లు సినిమా. ఏఎం రత్నం నిర్మాత. ఈ సినిమా షూటింగ్ పూర్తయితే, దసరాకు విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పట్లో షూటింగ్ పూర్తయ్యేలా లేదు. సినిమా దసరాకు రావడం దాదాపు కష్టం. కీరవాణి ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

First Published:  3 April 2023 2:39 PM GMT
Next Story