Telugu Global
Cinema & Entertainment

Pawan kalyan Harish Shankar: పవన్ కల్యాణ్ కొత్త సినిమా కూడా రీమేక్

Pawan kalyan Harish Shankar Movie - ఇకపై ఈ సినిమాపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. ఇదొక రీమేక్ ప్రాజెక్ట్ అనే విషయం తేలిపోయింది.

Pawan kalyan Harish Shankar: పవన్ కల్యాణ్ కొత్త సినిమా కూడా రీమేక్
X

ఈమధ్య కాలంలో ఎక్కువగా రీమేక్స్ చేస్తున్నాడు హీరో పవన్ కల్యాణ్. ఒక దశలో స్వయంగా అతడి అభిమానులే రీమేక్స్ వద్దంటూ గోలు చేశారు. నో రీమేక్స్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ట్రెండింగ్ కూడా చేశారు. అయినప్పటికీ పవన్ తన పంథా మార్చలేదు. ఇప్పుడు మరో రీమేక్ చేయబోతున్నాడు పవన్ కల్యాణ్.

హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ సినిమా అనగానే అది రీమేక్ ప్రాజెక్టు అయి ఉంటుందంటూ చాలా కథనాలు వచ్చాయి. కానీ అప్పట్లో దానిపై మేకర్స్ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కానీ అది రీమేక్ అనే విషయాన్ని ఈమధ్య ఆర్ట్ డైరక్టర్ ఆనంద్ సాయి బయటపెట్టాడు.

ఇప్పుడు దర్శకుడు దశరథ్ కూడా ఇదే విషయాన్ని బయటపెట్టాడు. పవన్-హరీశ్ కాంబోలో వస్తున్న సినిమా రీమేక్ అనే విషయాన్ని స్పష్టం చేశాడు దశరథ్.

తమిళ్ లో సూపర్ హిట్టయిన తేరి సినిమాకు రీమేక్ గా పవన్-హరీశ్ సినిమా వస్తోంది. ఈ రీమేక్ ప్రాజెక్టుపై హరీశ్ శంకర్ తో పాటు కలిసి పనిచేస్తున్నాడు దశరథ్. ఓ రచయితగా తేరి రీమేక్ కు చాలా మార్పులు చేశామని, పవన్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఆ మార్పులన్నీ ఉంటాయంటున్నాడు దశరథ్.

First Published:  24 Jan 2023 5:16 PM GMT
Next Story