Telugu Global
Cinema & Entertainment

Pawan Kalyan: కొత్త సినిమా ప్రకటించిన పవన్ కల్యాణ్

Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఈరోజు కొత్త సినిమా ఎనౌన్స్ చేశాడు. సుజీత్ దర్శకత్వంలో ఈ హీరో సినిమా చేయబోతున్నాడు.

Pawan Kalyan: కొత్త సినిమా ప్రకటించిన పవన్ కల్యాణ్
X

వరుసపెట్టి సినిమాలు చేస్తున్న పవన్ కల్యాణ్, ఈరోజు కొత్త సినిమా ప్రకటించాడు. డీవీవీ దానయ్య బ్యానర్ పై ఓ సినిమా చేయబోతున్నాడు పవన్. ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తాడు. ఈరోజు ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు.

ప్రభాస్ హీరోగా సాహో సినిమా చేశాడు ప్రభాస్. ఆ తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టలేదు. మధ్యలో రామ్ చరణ్, చిరంజీవి లాంటి హీరోల్ని డైరక్ట్ చేస్తాడంటూ ప్రచారం జరిగినప్పటికీ ఏదీ కార్యరూపం దాల్చలేదు. ఈసారి ఏకంగా పవన్ ను డైరక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు ఈ యంగ్ డైరక్టర్.

పవన్-సుజీత్ కాంబోలో సినిమా రాబోతోందంటూ దాదాపు వారం రోజులుగా ప్రచారం నడుస్తూనే ఉంది. ఆ ప్రచారం నిజమనే విషయం ఈరోజుతో స్పష్టమైంది. ఎనౌన్స్ మెంట్ పోస్టర్ లో ఎరుపు రంగు బ్యాక్ గ్రౌండ్ లో పవన్ కల్యాణ్ వెనక్కితిరిగి నిల్చొని ఉన్నాడు. అతడి ముందు సూర్యుడు ఎరుపెక్కి ఉన్నాడు. ఇక అతడి నీడ ఓ తుపాకీలా కనిపించింది.

ఈ పోస్టర్ తో సినిమాను గ్రాండ్ గా ఎనౌన్స్ చేశాడు నిర్మాత దానయ్య. సినిమాలో పవన్ ను కొంతమంది ఓజీ గా పిలుస్తారనే విషయాన్ని పోస్టర్ లో వెల్లడించారు. ఓజీ అంటే అర్థమేంటనేది మాత్రం చెప్పలేదు.

ఈ ప్రాజెక్టుకు రవికె చంద్రన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తాడు. ప్రస్తుతానికి ఈ డీటెయిల్స్ మాత్రమే వెల్లడించారు. హీరోయిన్, మ్యూజిక్ డైరక్టర్ లాంటి విషయాల్ని త్వరలోనే ఎనౌన్స్ చేస్తారు.

First Published:  4 Dec 2022 7:38 AM GMT
Next Story