Telugu Global
Cinema & Entertainment

ప్రమోషన్ కోసం పాదయాత్ర

అధికారం కోసం పాదయాత్రలు చేసిన రాజకీయ నేతల్ని చూశాం. మరి సినిమా సక్సెస్ కోసం పాదయాత్ర చేసే హీరోలున్నారా? తొలిసారి ఆ ఘనత సాధించబోతున్నాడు హీరో నాగశౌర్య. తన సినిమా కోసం పాదయాత్ర చేయబోతున్నాడు ఈ నటుడు.

ప్రమోషన్ కోసం పాదయాత్ర
X

రాజకీయాల్లో పాదయాత్రలు సర్వసాధారణం. అధికారం కోసం పార్టీలన్నీ పాదయాత్రలు చేస్తుంటాయి. మరి సినిమాల్లో పాదయాత్రలు ఉంటాయా? ఎందుకు ఉండకూడదు అని ప్రశ్నిస్తున్నాడు హీరో నాగశౌర్య. తన సినిమా ప్రచారం కోసం పాదయాత్ర షురూ చేస్తున్నాడు.

నాగశౌర్య హీరోగా అనీష్‌ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్‌ బ్యానర్ పై తెరకెక్కిన సినిమా 'కృష్ణ వ్రింద విహారి'. ఈ చిత్రంతో షిర్లీ సెటియా హీరోయిన్ గా పరిచయమౌతోంది. సెప్టెంబర్ 23న సినిమాను రిలీజ్ కు రెడీ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాజాగా చిత్ర యూనిట్ పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్ 14 - తిరుపతి, సెప్టెంబర్ 15 - నెల్లూరు, ఒంగోలు, సెప్టెంబర్ 16 - విజయవాడ, గుంటూరు, ఏలూరు, సెప్టెంబర్ 17 - భీమవరం, రాజమండ్రి, సెప్టెంబర్ 18 - కాకినాడ , వైజాగ్ లో హీరో నాగశౌర్యతో పాటు చిత్ర యూనిట్ పాదయాత్ర నిర్వహించి ప్రేక్షకులు, అభిమానులను కలుస్తారు. తమ సినిమా విశేషాల్ని వాళ్లతో పంచుకుంటారు.

ఓ సినిమా ప్రచారం కోసం ఇలా పాదయాత్ర నిర్వహించడం టాలీవుడ్ లో ఇదే తొలిసారి. ఇలా వినూత్నమైన ప్రచార పోకడను ఎత్తుకున్న యూనిట్, ఈ విషయంలో ట్రెండ్ సెట్ చేసిందనే చెప్పాలి.

First Published:  13 Sep 2022 12:37 PM GMT
Next Story