Telugu Global
Cinema & Entertainment

Robinhood | క్రిస్మస్ కానుకగా నితిన్ సినిమా

Robinhood - నితిన్ హీరోగా నటిస్తున్న సినిమా రాబిన్ హుడ్. ఈ సినిమాను క్రిస్మస్ కు సిద్ధం చేస్తున్నారు.

Robinhood | క్రిస్మస్ కానుకగా నితిన్ సినిమా
X

వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ లో హీరో నితిన్ డిఫరెంట్ పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఫస్ట్ లుక్ తో పాటు, గ్లింప్స్ కూడా వచ్చింది. వెంకీ కుడుముల నితిన్ ను దొంగగా పరిచయం చేసిన టీజర్ హాస్యభరితంగా ఉండగా, బర్త్ డే గ్లింప్స్ పూర్తి యాక్షన్ ప్యాక్డ్ గా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో అత్యున్నత స్థాయి నిర్మాణ, సాంకేతిక విలువలతో ఈ చిత్రం వస్తోంది.

ఇదిలా ఉండగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు. రాబిన్ హుడ్ డిసెంబర్ 20న విడుదల కానుంది. క్రిస్మస్ సెలవులు, ఆ తర్వాత న్యూ ఇయర్ సెలవులు ఈ సినిమాకి కలిసి రానున్నాయి. కమర్షియల్ అంశాలు, వినోదం తో వస్తున్న ఈ సినిమాకు ఇది సరైన విడుదల తేదీ.

రిలీజ్ డేట్ పోస్టర్ లో నితిన్ ముఖం లో ఇంటెన్సిటీ కలిగి ఉండి స్పోర్ట్స్ బైక్ పై మ్యాచో లుక్ లో కనిపిస్తున్నాడు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రానికి నిర్మాతలు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

First Published:  17 April 2024 5:17 PM GMT
Next Story