Telugu Global
Cinema & Entertainment

Nithin | ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ వస్తున్నాడు

Nithin - నితిన్ లేటెస్ట్ మూవీ ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్. ఇప్పుడీ సినిమా టీవీల్లోకి రాబోతోంది.

Extra Ordinary Man OTT | ఓటీటీలోకి నితిన్ సినిమా
X

నితిన్ హీరోగా నటించిన రీసెంట్ గా మూవీ ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్. వక్కంతం వంశీ దర్శకుడిగా మారి రెండో ప్రయత్నంగా చేసిన ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత ఓటీటీలోకి వచ్చింది. అక్కడ కూడా అంతంతమాత్రంగానే రెస్పాన్స్ రాబట్టుకుంది.

ఇప్పుడీ సినిమా బుల్లితెరపైకి రాబోతోంది. త్వరలోనే ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ సినిమాను స్టార్ మా ఛానెల్ లో ప్రసారం చేయబోతున్నారు. ఈ మేరకు మరోసారి సినిమాకు ప్రచారం మొదలుపెట్టారు. ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ సినిమాలో జూనియర్ ఆర్టిస్టుగా కనిపించాడు నితిన్. అతడి తండ్రిగా రావు రమేష్, ప్రేయసిగా శ్రీలీల నటించారు. హరీశ్ జైరాజ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు. 2 పాటలు విడుదలకు ముందే సూపర్ హిట్టయ్యాయి.

ఇలా మంచి ప్యాడింగ్, సూపర్ హిట్ మ్యూజిక్ ఉన్నప్పటికీ కంటెంట్ లో దమ్ములేక ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ థియేటర్లలో ఆడలేదు. కనీసం బుల్లితెరపైనైనా ఈ సినిమా సక్సెస్ అయితే సంబరపడాలని చూస్తున్నాడు నితిన్.

రీసెంట్ గా ఫ్లాప్ అయిన సినిమాలు బుల్లితెరపై మాత్రం హిట్ అవుతున్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ స్కంద, ఆదికేశవ సినిమాలు. ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ కూడా ఆ కోవలోకి చేరితే అందరికీ హ్యాపీ. లేదంటే, ఈ సినిమా కథ పరిసమాప్తం అవుతుంది.

First Published:  5 March 2024 5:16 PM GMT
Next Story