Telugu Global
Cinema & Entertainment

Nithin | ఎక్స్ ట్రా రిలీజ్ డేట్

Nithin Extraordinary Man - వక్కంతం వంశీ దర్శకత్వంలో ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ అనే సినిమా చేస్తున్నాడు నితిన్. ఈ మూవీకి రిలీజ్ డేట్ లాక్ చేశారు.

Nithin | ఎక్స్ ట్రా రిలీజ్ డేట్
X

టాలెంటెడ్ యాక్ట‌ర్ నితిన్, బ్యూటీ డాల్ శ్రీలీల హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘ఎక్స్‌ట్రా ఆర్టిన‌రీ మేన్‌’. రైట‌ర్ - డైరెక్ట‌ర్ వ‌క్కంతం వంశీ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. వరల్డ్ వైడ్‌గా డిసెంబర్ 8న ఎక్స్‌ట్రా ఆర్టిన‌రీ మేన్‌’ సినిమాను భారీ ఎత్తున్న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

మ్యూజికల్ జీనియస్ హారిస్ జైరాజ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇదివరకే విడులైన ‘డేంజర్ పిల్లా..’ సాంగ్‌కు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. అలాగే నితిన్ లుక్స్‌కి కూడా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. నితిన్ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి పాత్ర‌లో ఆకట్టుకోబోతున్నార‌ని, క‌చ్చితంగా ఆయ‌న అభిమానుల‌నే కాదు, ప్రేక్ష‌కుల‌ను కూడా నితిన్ త‌న పెర్ఫామెన్స్‌తో మెప్పించ‌నున్నాడు.

క్యారెక్ట‌ర్ బేస్డ్ స్క్రిప్ట్‌తో.. కిక్ త‌ర్వాత ఆ రేంజ్ జోన్‌లో తెర‌కెక్కుతోంది ఎక్స్ ట్రా. ఆడియెన్స్‌కి రోల‌ర్ కోస్ట‌ర్‌ లాంటి ఎక్స్‌పీరియెన్స్‌నిస్తూ న‌వ్విస్తూనే స‌ర్‌ప్రైజ్‌ల‌తో సినిమా మెప్పించ‌నుందని డైరెక్టర్ వక్కంతం వంశీ అన్నాడు.

శ్రేష్ఠ్ మూవీస్‌, ఆదిత్య‌మూవీస్ రుచిర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యాన‌ర్స్‌పై సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే, ఇది నితిన్ సొంత మూవీ.

రీసెంట్ గా సరైన సక్సెస్ అందుకోలేకపోయిన నితిన్, ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ ట్రాక్ లోకి రావాలనేది అతడి టార్గెట్. అటు వక్కంతం వంశీ కూడా దర్శకుడిగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు. తొలి సినిమా నా పేరు సూర్య మూవీతో ఫ్లాప్ అందుకున్న ఈ దర్శకుడు, తన రెండో సినిమాతోనైనా సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు. నిజానికి వక్కంతంకు ఇదే చివరి ఛాన్స్ కావొచ్చు. ఈసారి అతడు సక్సెస్ కొట్టకపోతే, పెద్ద హీరోలకు దాదాపు దూరమైపోతాడు. ఇక శ్రీలీల సంగతి సరేసరి. రీసెంట్ గా వచ్చిన స్కంద సినిమాతో ఫ్లాప్ అందుకుంది. త్వరలోనే భగవంత్ కేసరితో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ తర్వాత ఎక్స్ ట్రా మూవీతో ఆమె ప్రేక్షకులను పలకరించనుంది.

First Published:  10 Oct 2023 2:52 AM GMT
Next Story