Telugu Global
Cinema & Entertainment

Nithin | 17 రాత్రిళ్లు కష్టపడిన నితిన్

Nithin - ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ సినిమాలో తనకు ఇష్టమైన ఎపిసోడ్ పై స్పందించాడు నితిన్. దాని కోసం ఎంత కష్టపడ్డాడో వివరించాడు.

Nithin | 17 రాత్రిళ్లు కష్టపడిన నితిన్
X

రెండున్నర గంటల సినిమాలో గంటన్నర పాటు నాన్-స్టాప్ గా నవ్వుకునే స్టఫ్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ సినిమాలో ఉందంటున్నాడు నితిన్. వక్కంతం వంశీ రచన-దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తనకు బాగా ఇష్టమైన ఎపిసోడ్ ను బయటపెట్టాడు

ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ సినిమాలో ఇంటర్వెల్ ఎపిసోడ్ అదిరిపోతుందట. తను ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం కూడా ఆ ఇంటర్వెల్ ఎపిసోడ్ అంటున్నాడు నితిన్. దాని కోసం ఏకంగా 17 రోజులు నైట్ షిఫ్ట్ చేశాడట ఈ హీరో.

"ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. అయితే ఎపిసోడ్ గా చూసుకుంటే ఇంటర్వెల్ ఎపిసోడ్ నాకు చాలా ఇష్టం. కథ విన్నప్పట్నుంచి ఇంటర్వెల్ ఎపిసోడ్ ఎప్పుడు షూట్ చేద్దామా అని ఎదురుచూశాను. నాకు అంతిష్టం. ఆ ఇంటర్వెల్ ఎపిసోడ్ ను 16-17 రాత్రిళ్లు షూట్ చేశాం. నైట్ షూట్ అయినా ఉత్సాహంగా ఉండేది. ఉదయం 4 గంటలైనా ఎనర్జీ తగ్గేది కాదు. ఆ ఎపిసోడ్ అంటే అంతిష్టం నాకు."

ఇక ఈ సినిమా స్టోరీపై స్పందించాడు దర్శకుడు వక్కంతం వంశీ. ఈ కథను కేవలం నితిన్ కోసమే రాశానంటున్నాడు. ఎందుకంటే, నితిన్ తో సినిమా ఓకే అయిన తర్వాత ఈ పాయింట్ ను డెవలప్ చేశానని, నితిన్ తో చర్చిస్తూ, ఈ కథ రాసుకున్నానని అన్నాడు. కాబట్టి మరే హీరోను ఊహించుకోలేదని, కేవలం నితిన్ ను దృష్టిలో పెట్టుకొని ఈ కథ రాశానని అన్నాడు.

First Published:  6 Dec 2023 2:25 PM GMT
Next Story