Telugu Global
Cinema & Entertainment

Nithin | ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ సినిమాపై నితిన్ రియాక్షన్

Nithin - నితిన్ కొత్త సినిమా ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్. ఈ సినిమా కచ్చితంగా వినోదాన్ని పంచుతుందని చెబుతున్నాడు ఈ హీరో.

Nithin | ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ సినిమాపై నితిన్ రియాక్షన్
X

ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు హీరో నితిన్. ఈ సినిమాలో కేవలం వినోదం మాత్రమే ఉంటుందని, ఎవ్వర్నీ ఎడిపించమని చెబుతున్నాడు. సినిమా గురించి అతడి మాటల్లోనే...

* రెండున్నరేళ్ల క్రితం వక్కంతం వంశీ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ లైన్ చెప్పారు. ఆ తరువాత స్క్రిప్ట్‌గా మారడానికి టైం పట్టింది. గత ఏడాది ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. నా గత సినిమా సరిగ్గా ఆడకపోవడంతో ఈ ప్రాజెక్ట్ మీద నేను ఎక్కువగా ఫోకస్ పెట్టాను.

* ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ చిత్రం పూర్తిగా వినోదాత్మకంగా ఉంటుంది. జూనియర్ ఆర్టిస్ట్ కారెక్టర్ పోషించాను. అలా అని వారికి ఉండే కష్టాలను చూపించలేదు. ఇప్పుడు ఆ కష్టాలను చూపించినా జనాలు చూడరు. ఎవరి కష్టాలు వారికే ఉన్నాయి. ఈ మూవీ పూర్తిగా ఎంటర్టైన్మెంట్ మోడ్‌లోనే ఉంటుంది.

* ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ మూవీలో స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. హీరో కారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్‌గా, కొత్తగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు వక్కంతం వంశీ రాసిన కారెక్టర్లలో ఈ కారెక్టర్ ది బెస్ట్ అని చెప్పొచ్చు.

* ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ కథ కొత్తది కాకపోయినా పాయింట్ కొత్తగా ఉంటుంది. మేకింగ్, స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. ఇలాంటి ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఈ మధ్య కాలంలో రాలేదని మా అభిప్రాయం. ఆ లోటును ఈ సినిమా భర్తీ చేస్తుంది. కుటుంబమంతా చూడదగ్గ వినోదాత్మక చిత్రం ఇది.

First Published:  7 Dec 2023 4:17 PM GMT
Next Story