Telugu Global
Cinema & Entertainment

Swayambhu Movie | నిఖిల్ స్పెషల్ ట్రయినింగ్

Swayambhu Movie - ఈ సినిమాలో యుద్ధ సన్నివేశాల కోసం నిఖిల్ ట్రైనింగ్ తీసుకోబోతున్నాడు. దీని కోసం వియత్నాం వెెళ్లాడు.

Swayambhu Movie | నిఖిల్ స్పెషల్ ట్రయినింగ్
X

హీరో నిఖిల్, తన సినిమాల కోసం బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. కంఫర్ట్ జోన్ లో కాకుండా ఛాలెంజింగ్ పాత్రలను పోషించడానికి ఇష్టపడతాడు. నిఖిల్ తన నెక్స్ట్ పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభూ‘ కోసం కఠినమైన శిక్షణను పొందడానికి రెడీ అయ్యాడు.

యుద్ధ నేపథ్యంలో వస్తోంది స్వయంభూ సినిమా. ఇలాంటి కథలో నటించాలంటే ప్రొఫెషనల్ గా ఉండాలి. కొన్ని పోరాట నైపుణ్యాలు నేర్చుకోవాలి. అందుకే ‘స్వయంభూ’ లో ఒక యోధునిగా కనిపించడానికి నిఖిల్ నెల రోజుల పాటు కఠినమైన శిక్షణ కోసం వియత్నాం వెళ్లాడు.

ఆయుధాలు, మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకుంటున్నాడు నిఖిల్. సైగాన్‌లోని కొంతమంది బిగ్గెస్ట్ స్టంట్ మాస్టర్‌లు స్వయంభూ యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం నిఖిల్ కి శిక్షణ ఇస్తారు. అలాగే నిఖిల్ ఫిజికల్ గా కూడా మేకోవర్ అవుతున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్‌ లో ఒక లెజెండరీ యోధుడిగా కనిపించాడు. కెరీర్ లో నిఖిల్‌కి ఇది ఛాలెంజింగ్ రోల్.

భరత్ కృష్ణమాచారి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. నిఖిల్‌కు ఇది మైల్ స్టోన్ 20 వ చిత్రం కాగా, అతడి కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ మూవీ ఇది. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘స్వయంభూ’ సినిమాకు మంచి టెక్నికల్ సెటప్ కుదిరింది. రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తుండగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఎం ప్రభాహరన్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆల్రెడీ మొదలైన సంగతి తెలిసిందే. సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్.

First Published:  8 Sep 2023 4:16 AM GMT
Next Story