Telugu Global
Cinema & Entertainment

Narasimha Naidu - కనీవినీ ఎరుగని రీ-రిలీజ్

Narasimha Naidu Re-release - బాలకృష్ణ కెరీర్ లో బ్లాక్ బస్టర్ మూవీస్ లో ఒకటి నరసింహనాయుడు. ఇప్పుడీ సినిమాను రేపు రీ-రిలీజ్ చేయబోతున్నారు.

Narasimha Naidu - కనీవినీ ఎరుగని రీ-రిలీజ్
X

బాలయ్య నుంచి మరో సినిమా రీ-రిలీజ్ కు సిద్ధమైంది. నందమూరి బాలకృష్ణ హీరోగా బి.గోపాల్‌ దర్శకత్వంలో రూపొందిన సూపర్‌హిట్‌ చిత్రం ‘నరసింహ నాయుడు’ మరోసారి ప్రేక్షకుల్ని అలరించనుంది. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా రేపు, 4కె వెర్షన్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది నరసింహనాయుడు.

విడుదల టైమ్ లో చరిత్ర సృష్టించిన ఈ సినిమా, ఇప్పుడు రీ-రిలీజ్ లో కూడా సరికొత్త రికార్డ్ సృష్టించబోతోంది. డిజిటలైజ్‌ చేసిన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 750 నుంచి 1000 థియేటర్స్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రీ-రిలీజ్ లో ఓ సినిమాను ఈ స్థాయిలో రిలీజ్ చేయడం ఓ రికార్డ్.

బాలయ్య నుంచి ఇప్పటికే సమరసింహారెడ్డి సినిమా రీ-రిలీజైంది. ఈ సినిమాతోనే రీ-రిలీజ్ ట్రెండ్ ఊపందుకుంది. ఇక అక్కడ్నుంచి మిగతా హీరోల సినిమాలన్నీ క్యూ కట్టాయి. ఇప్పుడు మళ్లీ బాలయ్య నుంచి మరో సినిమా రీ-రిలీజ్ అవుతోంది. ఈసారి ఎలాంటి ట్రెండ్ క్రియేట్ అవుతుందో చూడాలి.

కత్తులతో కాదురా... కంటి చూపులతో చంపేస్తా అనే డైలాగ్‌ బాలయ్య చెబితేనే బావుంటుంది. ఆ డైలాగ్‌ను ఇప్పటికీ జనాలు మరచిపోలేదు. పరుచూరి బ్రదర్స్‌ కథ-పాటలు, మణిశర్మ సంగీతం, బాలయ్య యాక్షన్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. విజయవాడలో ఈ సినిమా వంద రోజుల ఫంక్షన్‌ని గ్రాండ్ గా చేశారు.

First Published:  9 Jun 2023 10:10 AM GMT
Next Story