Telugu Global
Cinema & Entertainment

Pratinidhi 2 | ఎట్టకేలకు సెట్స్ పైకి నారా రోహిత్

Pratinidhi 2 Movie - నారా రోహిత్ సెట్స్ పైకి వచ్చాడు. ప్రతినిధి-2 రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశాడు.

Pratinidhi 2 | ఎట్టకేలకు సెట్స్ పైకి నారా రోహిత్
X

కెరీర్ లో లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు నారా రోహిత్. ఎట్టకేలకు ఈ హీరో ఆమధ్య ఓ కొత్త సినిమా ప్రకటించాడు. ఇప్పుడా సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు. అలా భారీ విరామం తర్వాత సెట్స్ పైకి వచ్చాడు నారా రోహిత్.

తనకు మంచి గుర్తింపు తీసుకొచ్చిన ప్రతినిధి సినిమాకు సీక్వెల్ ప్రకటించాడు నారా రోహిత్. ఈ సినిమాకు ప్రతినిధి-2 అనే పేరు పెట్టారు. ప్రముఖ న్యూస్ యాంకర్ మూర్తి ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. తాజాగా సినిమా రెగ్యులర్ షూట్ ప్రారంభించారు.

ఇదొక పొలిటికల్ థ్రిల్లర్. సరిగ్గా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫీవర్ ఊపందుకున్న సమయానికి ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావాలనిమ ప్లాన్ చేస్తున్నారు. ఇక తాజా షెడ్యూల్ లో హీరో నారా రోహిత్ పై కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారు. మ్యాగ్జిమమ్ షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతుంది.

ఈ సినిమాకు మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందించబోతున్నాడు. జనవరి 25న రిపబ్లిక్ డే కానుకగా ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.

First Published:  29 Aug 2023 5:16 PM GMT
Next Story