Telugu Global
Cinema & Entertainment

Hi Nanna | తన సినిమా ఏడిపించదంటున్న నాని

Hi Nanna - హాయ్ నాన్న సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు హీరో నాని. తన సినిమా ఎమోషనల్ గా ఉంటుంది తప్ప, ఏడిపించదని చెబుతున్నాడు.

Hi Nanna | తన సినిమా ఏడిపించదంటున్న నాని
X

నాని తాజా చిత్రం హాయ్ నాన్న. 7వ తేదీన థియేటర్లలోకి వస్తోంది ఈ సినిమా. మూవీపై ఇప్పటికే ఆడియన్స్ కు ఓ అభిప్రాయం వచ్చేసింది. సినిమా ఎమోషనల్ గా సాగుతుందని ఫిక్స్ అయిపోయారు. ఎందుకుంటే, టీజర్-ట్రయిలర్ అలా ఉన్నాయి. అయితే నాని మాత్రం డిఫరెంట్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

హాయ్ నాన్న సినిమా ఏడిపించే మూవీ కాదంటున్నాడు ఈ స్టార్. ఇదొక ఎమోషనల్ మూవీ అని, అలా అని ఏడిపించే టైపు కాదని చెబుతున్నాడు. సినిమా చూస్తున్నంతసేపు కన్నీళ్లు వస్తాయని, అయితే అవి ఆనందబాష్పాలని చెబుతున్నాడు.

"హాయ్ నాన్న హాయిగా ఉండబోయే సినిమా. నాని ఏడిపించేస్తాడు ఇదొక ఎమోషనల్ ఫిల్మ్ అనుకుంటున్నారు కదా.. కాదు.. మీ కళ్ళల్లో నీళ్ళు కూడా ఆనందంగా తిరుగుతాయి. ఆనందభాష్పాలు తెప్పించే సినిమా ఇది. థియేటర్ కి వెళ్లి ఎలాంటి ఎమోషన్ ఫీలవ్వాలో అలాంటి ఫీలింగ్ మొదటి నుంచి చివరి వరకూ ఒక ప్రేమకథలో కుదిరితే ఎలా ఉంటుందో అది హాయ్ నాన్నలో చూస్తారు. ఇది సెలబ్రేట్ చేసుకునే సినిమా అవుతుంది తప్ప, ఏడిపించే సినిమా కాదు."

మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ఇందులో హీరోయిన్ శృతిహాసన్ ఓ కీలక పాత్ర పోషించింది. ఆమెకు సంబంధించిన ఓ పార్టీ సాంగ్ ను కూడా తాజాగా విడుదల చేశారు.

First Published:  30 Nov 2023 4:00 PM GMT
Next Story