Telugu Global
Cinema & Entertainment

Gautham Sithara | మహేష్ కొడుకు, కూతురు ఇండస్ట్రీకి ఎంట్రీ?

Gautham Sithara - మహేష్ పిల్లలు గౌతమ్, సితార ఎప్పుడు సినిమాల్లోకి వస్తున్నారు? ఈ ప్రశ్నకు నమ్రత స్పష్టమైన సమాధానం ఇచ్చారు.

Gautham Sithara | మహేష్ కొడుకు, కూతురు ఇండస్ట్రీకి ఎంట్రీ?
X

రెగ్యులర్ గా మహేష్, నమ్రతకు ఎదురయ్యే ప్రశ్న ఇది. కొడుకు గౌతమ్, కూతురు సితార సినిమాల్లోకి వస్తారా రారా.. వస్తే ఎప్పుడు? అనే ప్రశ్న కామన్ గా వస్తుంది. ఎట్టకేలకు ఈ ప్రశ్నలపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. గౌతమ్, సితార ఇద్దరూ సినిమాల్లోకి వస్తారని క్లారిటీ ఇచ్చింది నమ్రత.

"మా ఇద్దరు పిల్లల్ని మేం బాగా ప్రోత్సహిస్తాం. వాళ్లకు ఇష్టం లేనిది చేయమని మేం ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. సినిమాల్లోకి వస్తానని సితార చెప్పడం అత్యంత సహజంగా జరిగిపోయింది. ఆమె కెమెరాను బాగా ఎంజాయ్ చేస్తుంది. సినిమాలు చేయడం సితారకు హ్యాపీ. కాబట్టి నాకు, మహేష్ కు కూడా హ్యాపీ."

ఇలా సితార సినిమాల్లోకి వస్తుందనే విషయాన్ని బయటపెట్టింది నమ్రత. అదే టైమ్ లో గౌతమ్ డెబ్యూపై కూడా స్పందించింది. వన్-నేనొక్కడినే సినిమా తర్వాత మళ్లీ గౌతమ్ కనిపించలేదు. దీనిపై ఆమె స్పందిస్తూ, ప్రస్తుతం గౌతమ్ కు 16 ఏళ్లు వచ్చాయని, అతడికి చదువుకోవాలనే కోరిక బాగా ఉందని, గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తర్వాత కచ్చితంగా సినిమాల్లోకి వస్తాడని క్లారిటీ ఇచ్చింది నమ్రత.

మొత్తమ్మీద మహేష్ పిల్లలిద్దరూ సినిమాల్లోకి రాబోతున్నారనే స్పష్టత వచ్చేసింది. మరో ఐదేళ్లలో సితార సినిమాలు చేస్తుందని, ఇంకో ఏడేళ్ల తర్వాత గౌతమ్ సినిమాల్లోకి వస్తాడనే క్లారిటీ వచ్చేసింది.

First Published:  15 July 2023 5:14 PM GMT
Next Story