Telugu Global
Cinema & Entertainment

Rangabali | శ్రీవిష్ణు దారిలో నాగశౌర్య

Nagashaurya's Rangabali - రేపు రిలీజ్ కాబోతోంది రంగబలి. ఇవాళ్టి నుంచే పెయిడ్ ప్రీమియర్స్ స్టార్ట్ అవుతున్నాయి.

Rangabali | శ్రీవిష్ణు దారిలో నాగశౌర్య
X

సినిమా విడుదలకు ఒక రోజు లేదా 2 రోజుల ముందే ప్రీమియర్స్ వేయడం కొత్తగా మొదలైన సంప్రదాయం కాదు. కాకపోతే ఈ ప్రీమియర్స్ సంస్కృతి సెలబ్రిటీలు, మీడియాకు మాత్రమే పరిమితమై ఉండేది. కానీ ఇప్పుడు సామాన్య జనాలకు కూడా దీన్ని అందుబాటులోకి తెచ్చారు.

మొన్నటికిమొన్న సామాజవరగమన సినిమా ప్రీమియర్స్ ను తెలుగు రాష్ట్రాల్లో వేశారు. రిలీజ్ కు 2 రోజుల ముందు నుంచే ప్రేక్షకులకు సినిమాను అందుబాటులోకి తీసుకొచ్చారు. అది మంచి ఫలితాన్నిచ్చింది. దీంతో ఇప్పుడు ఇదే ఫార్ములాను రంగబలి కోసం కూడా ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నాడు నాగశౌర్య.

రేపు రిలీజ్ కాబోతోంది రంగబలి సినిమా. అయితే ఈ సినిమాకు ఈరోజు సాయంత్రం నుంచే ప్రీమియర్స్ మొదలుకాబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన థియేటర్లలో రంగబలి సినిమాను ముందుగానే చూసే వెసులుబాటు కల్పించారు. ఈ మేరకు బుక్ మై షోలో కూడా బుకింగ్స్ మొదలుపెట్టారు.

హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, వరంగల్, విశాఖపట్నం.. ఇలా ముఖ్యమైన సెంటర్లలో రంగబలి సినిమా ఈరోజు సాయంత్రం నుంచే ప్రేక్షకులకు అందుబాటులోకి రాబోతోంది.

నాగశౌర్య హీరోగా నటించిన ఈ సినిమాతో పవన్ బాసంశెట్టి దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ట్రయిలర్ హిట్టవ్వడం, ప్రమోషన్స్ ఆకట్టుకునేలా సాగడంతో, టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది రంగబలి ప్రాజెక్టు.

First Published:  6 July 2023 4:56 AM GMT
Next Story