Telugu Global
Cinema & Entertainment

Naga Shaurya Wedding: ఘనంగా నాగశౌర్య పెళ్లి వేడుక

Naga Shaurya Wedding: నాగశౌర్య ఓ ఇంటివాడయ్యాడు. లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ అనూష మెడలో మూడు ముళ్లు వేశాడు.

Naga Shaurya Weds Anusha Shetty
X

ఘనంగా నాగశౌర్య పెళ్లి వేడుక

హీరో నాగశౌర్య ఓ ఇంటివాడయ్యాడు. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి మెడలో మూడు ముళ్లు వేశారు. కొద్దిసేపటి కిందట బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో నాగశౌర్య-అనూష పెళ్లి ఘనంగా జరిగింది.

2 రోజుల పాటు వీళ్ల పెళ్లి వేడుక జరిగింది. నిన్న సంగీత్, మెహందీ లాంటి వేడుకలు జరిగాయి. ఇక ఈరోజు కీలకమైన పెళ్లి తంతులోకి ఎంటరైంది జంట. ఉదయం 11 గంటల ప్రాంతంలో అనూష మెడలో మూడు ముళ్లు వేశాడు. ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు, కొద్దిమంది టాలీవుడ్ జనాలు మాత్రమే హాజరయ్యారు.

అనూష శెట్టితో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నాడు నాగశౌర్య. ఆ తర్వాత పెద్దల్ని ఒప్పించి, ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు. నిజానికి పెళ్లికి కొన్ని రోజుల ముందు అస్వస్థతకు గురయ్యాడు. హాస్పిటల్ లో 2 రోజులు రెస్ట్ తీసుకొని, ఆ తర్వాత పెళ్లి వేడుకలో పాల్గొన్నాడు.

పెళ్లి దుస్తుల్లో వధూవరులిద్దరూ మెరిశారు. వీళ్లకు సంబంధించిన ఫొటోలతో పాటు, పెళ్లి వీడియోలు కూడా కొన్ని బయటకొచ్చాయి. త్వరలోనే టాలీవుడ్ ప్రముఖులకు పార్టీ ఇవ్వబోతున్నారు ఈ జంట.


ప్రస్తుతం నాగశౌర్య చేతిలో 3 సినిమాలున్నాయి. అందుకే పెళ్లి తర్వాత గ్యాప్ తీసుకోవడం లేదు ఈ హీరో.






First Published:  20 Nov 2022 8:18 AM GMT
Next Story