Telugu Global
Cinema & Entertainment

Naga Shaurya Marriage: ఈ నెల్లోనే నాగశౌర్య పెళ్లి

Naga Shaurya Marriage: హీరో నాగశౌర్య ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. బెంగళూర్ కు చెందిన అనూష ను ప్రేమించి పెళ్ళాడుతున్నాడు.

Naga Shaurya Marriage: ఈ నెల్లోనే నాగశౌర్య పెళ్లి
X

హీరో నాగశౌర్యపై ఇన్నాళ్లూ వినిపించిన పుకార్లు నిజమయ్యాయి. అతడు ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటాడంటూ కొన్ని రోజులుగా రూమర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడవే నిజమయ్యాయి. ఈ యంగ్ హీరో ఓ ఇంటివాడు కాబోతున్నాడు.


బెంగళూరుకు చెందిన అనూష అనే అమ్మాయితో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నాడు శౌర్య. ఇప్పుడు ఆ అమ్మాయితోనే పెళ్లి పీటలు ఎక్కుతున్నాడు. బెంగళూరులోని జేడబ్ల్యూ మారియట్ హోటల్ లో వీళ్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది.


ఈనెల 19, 20వ తేదీల్లో నాగశౌర్య-అనూష పెళ్లి జరుగుతుంది. 19వ తేదీన మెహందీ, సంగీత్ లాంటివి పెట్టుకున్నారు. ఇక 20వ తేదీ ఉదయం 11 గంటల 25 నిమిషాలకు అనూష మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు శౌర్య.


ఇది లవ్ కమ్ ఎరేంజ్డ్ మ్యారేజ్. అనూషను కొన్నాళ్లుగా ప్రేమిస్తున్నాడు శౌర్య. వీళ్ల ప్రేమను శౌర్య తల్లిదండ్రులు అంగీకరించారు. అనూష ఎవరు, ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్.


చాలామంది హీరోల్లా శౌర్య కూడా పెళ్లి తర్వాత గ్యాప్ తీసుకోవడం లేదు. ఇలా పెళ్లి తంతు ముగించి, అలా సెట్స్ పైకి వెళ్లిపోతాడు. సరిగ్గా 3 రోజుల కిందట ఓ కొత్త సినిమా లాంఛ్ చేశాడు శౌర్య. అరుణాచలం దర్శకత్వంలో వైష్ణవి ఫిలిం బ్యానర్ పై ఈనెల్లోనే ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.

First Published:  10 Nov 2022 11:32 AM GMT
Next Story