Telugu Global
Cinema & Entertainment

Nagarjuna | నా సామిరంగా.. తగ్గేదేలే

Nagarjuna - నాగార్జున తాజా చిత్రం నా సామిరంగ. ఈ సినిమాను కచ్చితంగా సంక్రాంతికి విడుదల చేయాలని యూనిట్ కు సూచించాడు నాగార్జున.

Naa Saami Ranga | నాగార్జున మూవీ షూటింగ్ అప్ డేట్స్
X

Naa Saami Ranga | నాగార్జున మూవీ షూటింగ్ అప్ డేట్స్

సంక్రాంతి బాక్సాఫీస్ రంజుగా మారిన సంగతి తెలిసిందే. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, ఈగల్.. ఈ 4 సినిమాలు సంక్రాంతికి విడుదల కావడం ఖాయమని తేలిపోయింది. విజయ్ దేవరకొండ చిత్రం ఫ్యామిలీ స్టార్ సంక్రాంతి రేసు నుండి వాయిదా పడింది. ఇక తమిళ డబ్బింగ్ చిత్రాలు కెప్టెన్ మిల్లర్, లాల్ సలామ్, అయలాన్ సంక్రాంతికి వస్తున్నప్పటికీ వాటి ప్రభావం తక్కువే.

గుంటూర కారం, హనుమాన్, సైంధవ్, ఈగల్ మాత్రం పోటీ పడుతున్నాయి. వీటికి భారీగా థియేటర్లు దక్కాయి. అయితే లిస్ట్ లో నాగార్జున నటిస్తున్న నాసామి రంగ కూడా ఉంది. ఈ సినిమాకు చాలా తక్కువ థియేటర్లు రావడంతో సంక్రాంతికి వాయిదా పడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అయితే సంక్రాంతి సీజన్‌ను మిస్ చేసుకోవద్దని నాగార్జున తన టీమ్‌కు సూచించాడు.

నాసామి రంగా షూటింగ్ పార్ట్ కూడా దాదాపు పూర్తి చేసుకుంది. సంక్రాంతి పండగ మాత్రమే తమకు మంచి నంబర్లను ఇస్తుందని నాగార్జున అభిప్రాయపడుతున్నాడు. థియేటర్ల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, తనకు కలిసొచ్చిన సంక్రాంతి సీజన్ ను వదులుకోవద్దని భావిస్తున్నాడు. చూస్తుంటే, తన స్టార్ డమ్ కంటే సంక్రాంతి సీజన్ నే నాగ్ ఎక్కువగా నమ్ముకున్నట్టు కనిపిస్తోంది.

ఇంతకుముందు నాగ్ నటించిన సోగ్గాడో చిన్ని నాయనా, బంగార్రాజు సినిమాలు సంక్రాంతి బరిలో సక్సెస్ అయ్యాయి. అందుకే నా సామిరంగా సినిమాను కూడా సంక్రాంతికే ప్లాన్ చేస్తున్నారు.

First Published:  28 Nov 2023 1:47 AM GMT
Next Story