Telugu Global
Cinema & Entertainment

Thandel | హైదరాబాద్ లో తండేల్

Thandel Movie - శ్రీకాకుళం సాగరతీరం నేపథ్యంలో తెరకెక్కుతున్న తండేల్ సినిమా షూటింగ్, ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. స్పెషల్ సెట్ వేసి షూట్ చేస్తున్నారు.

Thandel | హైదరాబాద్ లో తండేల్
X

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న దేశభక్తి అంశాలతో కూడిన రస్టిక్ లవ్ స్టొరీ 'తండేల్'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. చందూ మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.

'తండేల్' సెట్స్ నుండి కొన్ని షూట్ డైరీస్ ఇప్పుడు బయటకు వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమా ప్రచారాన్ని షూటింగ్ తో పాటు కొనసాగిస్తున్నారు. తాజాగా మరోసారి మేకర్స్ ప్రచారం చేశారు. సెట్స్ లో హీరోహీరోయిన్లు, టెక్నీషియన్స్ మధ్య తీసిన వర్కింగ్ స్టిల్స్ ను రిలీజ్ చేశారు. ఈ ఫొటోల్లో ప్రజెంటర్ అల్లు అరవింద్ కూడా ఉన్నారు.

నాగచైతన్య, సాయిపల్లవి ఇద్దరూ డి-గ్లామరస్ గా కనిపిస్తున్నారు. దర్శకుడు చందూ మొండేటి ఈసారి తన శైలికి భిన్నంగా కథ చెబుతున్నాడనే విషయం ఈ వర్కింగ్ స్టిల్స్ చూస్తే తెలుస్తుంది. నటీనటుల గెటప్‌లు, కాస్ట్యూమ్స్, బాడీ లాంగ్వేజ్, యాసలతో సహా ప్రతిదీ పర్ఫెక్ట్‌గా కనిపించేలా చూసుకుంటున్నారు.

ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, శామ్‌దత్ డీవోపీగా పని చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు. ఈ ఏడాదిలోనే థియేటర్లలోకి రాబోతోంది తండేల్.




First Published:  24 March 2024 9:47 AM GMT
Next Story