Telugu Global
Cinema & Entertainment

NagaChaitanya | నాగచైతన్య తండేల్ ఫస్ట్ లుక్ రిలీజ్

NagaChaitanya's Thandel Movie - నాగచైతన్య కొత్త సినిమా తండేల్ అనే టైటిల్ పెట్టారు. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఇంతకీ తండేల్ అంటే అర్థం ఏంటి?

NagaChaitanya | నాగచైతన్య తండేల్ ఫస్ట్ లుక్ రిలీజ్
X

నాగ చైతన్య, చందూ మొండేటిల కాంబోలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. వచ్చేనెల నుంచి ఇది సెట్స్ పైకి రానుంది. సెట్స్ పైకి వెళ్లకముందే ఈ సినిమా టైటిల్ ను, నాగచైతన్య ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

చైతూ-చందు మొండేటి సినిమాకు 'తండేల్' అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. 'తండేల్' అంటే శక్తివంతమైన, ఆకర్షణీయమైన, ఏకాగ్రత అని అర్ధం. ఒక వ్యక్తికి కసి ఉంటే ఏదైనా సాధించగలడనే అర్థం ఇందులో ఉంది.

నాగచైతన్య ఈ చిత్రంలో మత్స్యకారుడిగా కనిపించనున్నాడు. ఆ ఫిజిక్ కోసం కొన్ని నెలలుగా చాలా హార్ట్ వర్క్ చేశాడు. ఫస్ట్ లుక్ లో పొడవాటి జుట్టు, గడ్డంతో రఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు. చేతిలో తెడ్డు పట్టుకొని, పడవపై కూర్చున్న నాగ చైతన్య ఫస్ట్‌లుక్ బాగుంది.

యదార్థ ఘటనల ఆధారంగా రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ఒరిజినల్ లొకేషన్లలోనే జరగనుంది. ఈ చిత్రంలో నాగచైతన్యకు జోడిగా సాయి పల్లవి నటించనుంది. సూపర్‌హిట్ 'లవ్ స్టోరీ' తర్వాత వీళ్ల కాంబోలో ఇది రెండోది. పూర్తిగా భిన్నమైన నేపథ్యంలో సాగే ప్రేమకథ తండేల్. ఇందులో పాకిస్థాన్ ఎలిమెంట్ కూడా ఉంది.

రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. డిసెంబర్ లో రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేసి, ఏకథాటిగా 3 నెలల పాటు షూటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు.

First Published:  22 Nov 2023 5:37 PM GMT
Next Story