Telugu Global
Cinema & Entertainment

Thandel | కీలకమైన షెడ్యూల్ లో నాగచైతన్య సినిమా

Thadel Movie - నాగచైతన్య హీరోగా నటిస్తున్న సినిమా తండేల్. ఇప్పుడీ సినిమా షూటింగ్ కీలకమైన దశకు చేరుకుంది.

Thandel | కీలకమైన షెడ్యూల్ లో నాగచైతన్య సినిమా
X

నాగ చైతన్య, చందూ మొండేటి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా తండేల్. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం ఉడిపిలో ప్రారంభమైంది. ఈ భారీ షెడ్యూల్‌లో కొన్ని కీలకమైన సన్నివేశాలు, యాక్షన్ పార్ట్ ని షూట్ చేస్తున్నారు. ప్రస్తుతం సముద్రం మధ్యలో వచ్చే కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ సాగుతోంది. ఈ సందర్భంగా మరో ఇంట్రెస్టింగ్ ఫొటో షేర్ చేసింది యూనిట్. ఫోటోలో నాగచైతన్య, సముద్రం వైపు నడుస్తూ ఆనందంగా కనిపిస్తున్నాడు.

కంప్లీట్ మేకోవర్‌ అయిన నాగ చైతన్య ఈ సినిమాలో మునుపెన్నడూ లేని గెటప్‌లో, రఫ్ లుక్ లో కనిపించనున్నాడు. షూట్ ప్రారంభించడానికి ముందు ఇంటెన్స్ ట్రైనింగ్, హోంవర్క్ చేశాడు.

యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. తండేల్ పూర్తిగా భిన్నమైన నేపథ్యంలో సాగే ప్రేమకథ.

అత్యున్నత సాంకేతిక నిపుణులను ఈ చిత్రానికి పని చేస్తున్నారు. కథలో సంగీతానికి మంచి స్కోప్ ఉన్నందున, జాతీయ అవార్డ్ గ్రహీత దేవిశ్రీ ప్రసాద్ ను తీసుకున్నారు. విజువల్ వండర్ ని అందించడానికి షామ్‌దత్ ను కెమెరామ్యాన్ గా తీసుకున్నారు. వరుస షెడ్యూల్స్ తో 2 నెలల్లో తండేల్ ను పూర్తిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.




First Published:  27 Dec 2023 4:33 PM GMT
Next Story