Telugu Global
Cinema & Entertainment

Nagachaitanya: చైతూ సినిమాకు టైటిల్ ఫిక్స్

Nagachaitanya's new movie: ఈ రోజు నాగ చైతన్య పుట్టినరోజు. ఈ సందర్భంగా చైతూ కొత్త సినిమా టైటిల్ ఖరారు చేసారు.

Nagachaitanya: చైతూ సినిమాకు టైటిల్ ఫిక్స్
X

అక్కినేని నాగచైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌ లో తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం 2 నెలల క్రితమే సెట్స్ పైకి వెళ్లింది. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. నాగచైతన్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా ఇది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


ఈరోజు (అక్టోబర్ 23) నాగచైతన్య బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా మేకర్స్ శుభకాంక్షలు తెలుపుతూ ... అభిమానులు, సినీ ప్రేమికులకు స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ చిత్రానికి "కస్టడీ"అనే పవర్ ఫుల్ టైటిల్ లాక్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో నాగచైతన్య ఎగ్రెసివ్ గా కనిపిస్తున్నాడు.


నిజాయితీ, దృఢ నిశ్చయంతో ఉన్న పోలీస్ ఆఫీసర్ "ఎ.శివ" పాత్రలో చైతూ కనిపిస్తున్నాడు. అతను చూడాలనుకునే మార్పు కోసం అన్ని అసమానతలకు వ్యతిరేకంగా నిలబడి పోరాడతాడని పోస్టర్ చూస్తే అర్ధమౌతోంది. శివ తాను నమ్మే విధానం కోసం తన స్వంత వ్యవస్థతో పోరాటం చేస్తాడని ఫస్ట్ లుక్ చూస్తే తెలుస్తోంది.


దర్శకుడు వెంకట్ ప్రభు, నాగచైతన్యని పూర్తిగా కొత్త అవతార్‌ లో ప్రజంట్ చేశాడు. విలన్ గా అరవింద్ స్వామి నటిస్తుండగా.. ప్రియమణి, శరత్ కుమార్, సంపత్ రాజ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దిగ్గజ తండ్రీకొడుకులు ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.




First Published:  23 Nov 2022 11:45 AM GMT
Next Story