Telugu Global
Cinema & Entertainment

NagaChaitanya | శ్రీకాకుళంలో నాగచైతన్య ప్రత్యక్షం

NagaChaitanya - శ్రీకాకుళంలోని తీరప్రాంతంలో ఉన్న ఓ మత్స్యకార గ్రామాన్ని సందర్శించాడు హీరో నాగచైతన్య. ఎందుకు?

NagaChaitanya | శ్రీకాకుళంలో నాగచైతన్య ప్రత్యక్షం
X

నాగ చైతన్య తను చేయబోయే కొత్త చిత్రం కోసం శ్రీకాకుళంలోని ఒక గ్రామాన్ని సందర్శించి మత్స్యకారులని కలిశాడు. మత్స్యకారులను, వారి కుటుంబాలను కలుసుకుని వారి సంస్కృతి, జీవనశైలిని అర్థం చేసుకున్నాడు. ఇలా తన కొత్త సినిమాలో పాత్ర కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు నాగచైతన్య.

కార్తికేయ 2తో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌ను అందించిన చందూ మొండేటి ఈ ప్రాజెక్ట్ కు దర్శకత్వం వహిస్తున్నాడు. నాగచైతన్య కెరీర్ లో 23వ చిత్రం ఇది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పిణలో, టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మించనున్నాడు.

ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మేకర్స్ ఈ నెలలో షూట్‌ను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. నాగ చైతన్య, చందూ మొండేటి, బన్నీ వాస్ నిన్న వైజాగ్‌ వెళ్ళారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లా గార మండలం కె.మత్స్యలేశం గ్రామానికి వెళ్లి అక్కడి మత్స్యకారుల కుటుంబాలను కలిశారు.

ఈ సందర్భంగా మీడియాతో హీరో నాగచైతన్య మాట్లాడుతూ.. ''ఆరు నెలల క్రితం చందూ కథను చెప్పాడు. చాలా ఎగ్జైట్ అయ్యాను. యదార్థ సంఘటనల ఆధారంగా కథను డెవలప్ చేశాడు. వాస్, చందూ రెండేళ్లుగా కథపై వర్క్ చేస్తున్నారు. కథ చాలా ఇన్‌స్పైరింగ్ గా ఉంది. మత్స్యకారుల జీవనశైలిని తెలుసుకోవడానికి ఇక్కడకు వచ్చాను. ఈ టూర్ తో ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి.' అని అన్నాడు.

శ్రీకాకుళం జిల్లాలోని ఓ మత్స్యకార కుటుంబంలో 2018లో జరిగిన యదార్థ ఘటన ఆధారంగా ఈ కథ రాసుకున్నాడు చందు మొండేటి. రెండేళ్లుగా ఈ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నాడట ఈ దర్శకుడు.








First Published:  3 Aug 2023 5:38 PM GMT
Next Story