Telugu Global
Cinema & Entertainment

నాగచైతన్య కొత్త సినిమా అప్ డేట్

వెంకట్ ప్రభు దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు చైతూ. ఈ సినిమా ఎంత వరకు వచ్చిందో చెక్ చేద్దాం..

nagachaitanya krithi shetty (1)
X

నాగచైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. అరవింద్ స్వామి, ప్రియమణి, జీవా, వరలక్ష్మి శరత్ కుమార్ లాంటి ప్రముఖులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. రీసెంట్‌గా సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమా మైసూర్‌లో కీలక షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్‌లో నాగచైతన్యకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. మైసూర్‌లోని అందమైన లొకేషన్లలో ఈ షెడ్యూల్‌ పూర్తయింది.

ఈ చిత్రంలో నాగచైతన్య కొత్తగా కనిపించనున్నాడు. చైతన్య కెరీర్‌లో భారీ బడ్జెట్ సినిమాగా ఇది తెరకెక్కుతోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

ఈ చిత్రానికి దిగ్గజ సంగీత దర్శకులైన తండ్రీకొడుకులు ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. తండ్రికొడుకులు కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. స్టార్ డైలాగ్ రైటర్ అబ్బూరి రవి మాటలు అందిస్తున్నాడు.

First Published:  22 Oct 2022 12:59 PM GMT
Next Story