Telugu Global
Cinema & Entertainment

రాధిక లేకపోతే ఈ సినిమా ఆపేద్దాం అనుకున్నాను

కృష్ణా వ్రిందా విహారి సినిమాలో కీలక పాత్ర పోషించారు సీనియర్ ఆర్టిస్టు రాధిక. ఆవిడ ఆ పాత్రను ఒప్పుకోకపోతే ఏకంగా సినిమా ఆపేద్దాం అనుకున్నాడట శౌర్య.

Naga Shaurya
X

నాగశౌర్య

కృష్ణ వ్రిందా విహారి.. నాగశౌర్య హీరోగా నటించిన తాజా చిత్రం ఇది. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు హీరో. ఇందులో ఓ కీలక పాత్రలో సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ కనిపించారు. ఆమె కనుక ఆ పాత్రను అంగీకరించకపోతే, సినిమా ఆపేద్దాం అనుకున్నారట.

"ఒక్కరు లేకపోతే మాత్రం ఈ సినిమా చేయనని చెప్పాను. దర్శకుడు అనీష్ కు మొదటి రోజే ఆ విషయం చెప్పాను. అలాగే షూటింగ్ మొదలైన మొదటి రోజు కూడా ఆవిడకు చెప్పాను. ఆవిడ మరెవరో కాదు రాధిక శరత్ కుమార్. ఫస్ట్ డే షూట్ లో ఆవిడ కారవాన్ లోకి వెళ్లి మరీ చెప్పాను. ఈ సినిమా చేయకపోతే ఇక్కడితో ఆపేస్తామని క్లియర్ గా చెప్పాను. అంత ఇంపార్టెంట్ పాత్ర ఆవిడది. ఆమె తప్ప ఎవరు చేసినా ఆ పాత్ర వేస్ట్ అయిపోతుంది. అందుకే ఆమెతో అలా చెప్పాను."

కృష్ణా వ్రిందా విహారి సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. ఈ వేదికపై ఈ మేటర్ ను బయటపెట్టాడు నాగశౌర్య. ఇక పాదయాత్రపై స్పందిస్తూ.. థియేటర్లకు ఆడియన్స్ ను తీసుకురావడం ఇప్పుడు పెద్ద సవాల్ గా మారిందన్నాడు శౌర్య. సినిమా చాలా బాగా వచ్చిందని, తనను నమ్మి థియేటర్లకు రావాలని ఆడియన్స్ ను ఆహ్వానించడం కోసమే తను పాదయాత్ర చేశానని చెప్పుకొచ్చాడు. ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది కృష్ణా వ్రిందా విహారి సినిమా.

First Published:  21 Sep 2022 4:21 AM GMT
Next Story