Telugu Global
Cinema & Entertainment

Nabha Natesh | ఎట్టకేలకు మరో అవకాశం

Nabha Natesh - నభా నటేష్ మరో అవకాశం దక్కించుకుంది. నిఖిల్ సరసన నటిస్తోంది.

Nabha Natesh | ఎట్టకేలకు మరో అవకాశం
X

'కార్తికేయ 2'తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న నిఖిల్, ఇప్పుడు 'స్వయంభూ' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. లెజెండరీ యోధుడి పాత్రలో నిఖిల్ కనిపించబోతున్నాడు. దీని కోసం ఆయుధాలు, మార్షల్ ఆర్ట్స్ , గుర్రపు స్వారీలో ట్రైనింగ్ తీసుకున్నాడు.

భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న 'స్వయంభూ' నిఖిల్ కు 20వ చిత్రం. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్‌పై భువన్ , శ్రీకర్ ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె తన పాత్ర కోసం శిక్షణ కూడా తీసుకుంది. మేకర్స్ ఈరోజు మరో హీరోయిన్ పాత్రను పరిచయం చేశారు. స్వయంభూ సినిమాలో నభా నటేష్ కూడా చేరింది.

ఈ పాత్ర కోసం ఆమె అందంగా ముస్తాబైంది. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజైంది. మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌లో, చీరతో నగలతో ఆమె యువరాణిలా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఈ చిత్రంలో నభా నటేష్ కీలకమైన, శక్తివంతమైన పాత్రను పోషిస్తోంది. యాక్సిడెంట్ తర్వాత సినిమాలకు దూరమైన నభా నటేష్, ఇప్పుడిప్పుడే మళ్లీ నటిస్తోంది. ప్రియదర్శి సరసన ఓ సినిమా చేస్తున్న ఈ చిన్నది, ఇప్పుడు స్వయంభూ సినిమాలో కూడా నటించే అవకాశం అందుకుంది.

First Published:  4 April 2024 4:54 PM GMT
Next Story