Telugu Global
Cinema & Entertainment

Bhakta Kannappa | మంచు విష్ణు హీరోగా భక్త కన్నప్ప

Manchu Vishnu Kannappa - తన డ్రీమ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు మంచు విష్ణు. భక్త కన్నప్ప చిత్రాన్ని ఈరోజు అధికారికంగా లాంచ్ చేశాడు.

Bhakta Kannappa | మంచు విష్ణు హీరోగా భక్త కన్నప్ప
X

మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' చిత్రాన్ని పూజ కార్యక్రమాలతో ప్రారంభించాడు. చాలా రోజులుగా ఈ సినిమా కథ మీద పని చేస్తున్న విష్ణు, ఈరోజు 'కన్నప్ప' చిత్రాన్ని శ్రీకాళహస్తి లో స్టార్ట్ చేశాడు. త్వరలో చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారు.

భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడు హీరో విష్ణు మంచు. నటుడు, నిర్మాత మోహన్ బాబు ఈ సినిమాకు నిర్మాత. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై ఈ సినిమా రాబోతోంది.

స్టార్ ప్లస్ లో మహాభారత సిరీస్ కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకుడు. కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ విష్ణు మంచు సరసన హీరోయిన్ గా నటిస్తోంది. పరుచూరి గోపాలకృష్ణ, బుర్ర సాయి మాధవ్, తోట ప్రసాద్ ఈ సినిమాకు కథ అందిస్తూ, తుది మెరుగులు దిద్దారు.

కన్నప్ప చిత్రానికి మణిశర్మ, స్టీఫెన్ దేవాసి మ్యూజిక్ అందిస్తారు. ఈ సినిమాను స్విట్జర్లాండ్ లో షూట్ చేస్తారు. సింగిల్ షెడ్యూల్ లో టోటల్ సినిమాను పూర్తిచేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సౌత్-నార్త్ కు చెందిన పెద్ద స్టార్లు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తారట.

First Published:  18 Aug 2023 3:56 PM GMT
Next Story