Telugu Global
Cinema & Entertainment

Manchu Lakshmi - ఇది మంచు లక్ష్మి ఆదిపర్వం

Manchu Lakshmi - మంచు లక్ష్మి లీడ్ రోల్ పోషిస్తున్న సినిమా ఆదిపర్వం. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది. విడుదలకు కూడా సిద్ధమైంది.

Manchu Lakshmi - ఇది మంచు లక్ష్మి ఆదిపర్వం
X

అన్వికా ఆర్ట్స్ - అమెరికా ఇండియా (ఎ.ఐ) ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఆదిపర్వం". సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మంచు లక్ష్మి లీడ్ రోల్ పోషిస్తోంది. “ఆదిపర్వం” చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. 1974-1990 మధ్యకాలంలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.

"అమ్మోరు - అరుంధతి" చిత్రాల తరహాలో రాబోతోంది ఆదిపర్వం. రాక్షసులకి, దేవతలకు మధ్య జరిగే యుద్ధంతో ఈమధ్య కాలంలో సినిమాలు రాలేదు. ఎర్రగుడి నేపథ్యంలో అమ్మవారి చుట్టూ అల్లుకున్న ప్రేమకథ "ఆదిపర్వం". ఈ సినిమాలో గ్రాఫిక్స్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తాయంటున్నాడు దర్శకుడు సంజీవ్ మేగోటి.

కేవలం గ్రాఫిక్స్ మాత్రమే కాకుండా.. హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామా, అందమైన ఎమోషనల్ ప్రేమకథ కూడా ఈ సినిమాకు హైలెట్ అంటున్నారు. ఇందులో మంచు లక్ష్మి పాత్ర ఏంటనేది సస్పెన్స్ అంటున్నారు మేకర్స్. ఆమె దేవతగా నటించిందా లేక లవర్ గా కనిపించిందా అనేది సినిమా చూసి తెలుసుకోవాలంటున్నాడు.

మంచు లక్ష్మి పుట్టిన రోజుని పురస్కరించుకుని ఈ చిత్రంలో ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు దర్శకనిర్మాతలు. మంచు లక్ష్మీప్రసన్న ఇప్పటివరకు చేయని కొత్త పాత్ర ఇది. ఈ సినిమాలో ఆమె ఫైట్స్ కూడా చేసింది. ఆమె చేసిన 2 ఫైట్స్ సినిమాకి హైలెట్స్ గా నిలుస్తాయంటున్నారు. మంచులక్ష్మి క్యారెక్టర్, ఆవిడ పెర్ఫామెన్స్ ను జనాలు కలకాలం గుర్తుంచుకుంటారని చెబుతున్నాడు దర్శకుడు.

ఈ చిత్రంలో ఆదిత్యఓం, ఎస్తేర్, సుహాసిని ,శ్రీజిత ఘోష్, శివ కంఠంనేని, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్ లాంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు. రెట్రో ఫీల్ తో ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా మొదలై కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్ గా ఆద్యంతం అలరించే చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయబోతున్నారు.




First Published:  8 Oct 2023 5:48 PM GMT
Next Story