Telugu Global
Cinema & Entertainment

Guntur Kaaram | లీకుల బారిన పడిన మహేష్ మూవీ

Mahesh's Guntur Kaaram - ఊహించని విధంగా గుంటూరుకాలం సినిమా లీకుల బారిన పడింది. కొన్ని స్టిల్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

గుంటూరు కారం మూవీలో మహేష్ బాబు
X

గుంటూరు కారం మూవీలో మహేష్ బాబు

రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఊహించని విధంగా ఈమధ్య ఓ సాంగ్ లీక్ అయింది. అదే టైమ్ లో ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా నుంచి కూడా పోస్టర్ లీక్ అయింది. వీళ్లపై ఆ సినిమా నిర్మాతలు కఠిన చర్యలకు దిగారు. దిల్ రాజు క్రిమినల్ కేసు నమోదు చేయగా, కల్కి నిర్మాత అశ్వనీదత్, ఏకంగా సదరు గ్రాఫిక్స్ కంపెనీపై దావా వేశాడు.

ఆ రెండు అంశాలు వార్తల్లో నలుగుతుండగానే, దురదృష్టవశాత్తు, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో ప్రాజెక్ట్ ఇప్పుడు ఇలాంటి లీక్ కు బలి అయింది. ఈసారి గుంటూరుకారం వంతు.

మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా గుంటూరుకారం. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ సినిమా. ప్రస్తుతం మహేష్ బాబు, ఇతర నటీనటులతో కీలకమైన పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇలాంటి టైమ్ లో సెట్ నుంచి కొన్ని ఫొటోలు లీక్ అయ్యాయి. ఆ వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

దీంతో హారిక-హాసిని బ్యానర్ వెంటనే ఎలర్ట్ అయింది. మరిన్ని లీకులు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. మరోవైపు ఊహించని విధంగా స్టిల్స్ లీక్ అవ్వడంపై మహేష్ అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కల్కి, గేమ్ ఛేంజర్‌ నిర్మాతల తరహాలో.. నిర్మాత చినబాబు కూడా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

First Published:  21 Sep 2023 10:52 AM GMT
Next Story