Telugu Global
Cinema & Entertainment

Guntur Kaaram | మహేష్ మూవీ 5 రోజుల వసూళ్లు

Guntur Kaaram - మహేష్ హీరోగా నటించిన గుంటూరుకారం సినిమా 5 రోజుల రన్ పూర్తి చేసుకుంది. ఈ 5 రోజుల వసూళ్లు ఎలా వచ్చాయో చూద్దాం

Guntur Kaaram | మహేష్ మూవీ 5 రోజుల వసూళ్లు
X

ఓవైపు నెగెటివ్ టాక్ నడుస్తున్నప్పటికీ, మరోవైపు గుంటూరు కారం సినిమాకు భారీగా వసూళ్లు వస్తూనే ఉన్నాయి. ఈ సినిమా ఓపెనింగ్ డే తర్వాత, నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ ఓవర్సీస్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో బాగానే రన్ అవుతోంది. మహేష్ బాబు, త్రివిక్రమ్ ల తాజా ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఐదో రోజు కూడా మంచి వసూళ్లు రాబట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో ఐదో రోజు గుంటూరుకారం సినిమాకు 7 కోట్ల 50 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఒక్క నైజాం నుంచి 2 కోట్ల రూపాయలకు పైగా షేర్ రావడం విశేషం. హాలిడే కావడంతో నెగెటివ్ టాక్ వచ్చినా వసూళ్లు తగ్గలేదు. ఓవరాల్ గా చూసుకుంటే, ఐదో రోజు ప్రపంచవ్యాప్తంగా గుంటూరుకారం సినిమాకు 8 కోట్ల 25 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

ఇక ఓవరాల్ వసూళ్ల పరంగా చూసుకుంటే, తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల్లో జీఎస్టీతో కలిపి 77 కోట్ల రూపాయలు రాబట్టింది గుంటూరుకారం. వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 97 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. మరికొన్ని గంటల్లో ఈ సినిమా వంద కోట్ల షేర్ దాటబోతోంది. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే, గట్టిగా మరో వారం రోజుల పాటు థియేటర్లలో ఆడాల్సి ఉంటుంది.

First Published:  17 Jan 2024 3:57 PM GMT
Next Story