Telugu Global
Cinema & Entertainment

Mahesh Babu | రీ-రిలీజెస్ పై స్పందించిన మహేష్ బాబు

Mahesh Babu Re-release - తన సినిమాలు రీ-రిలీజ్ లో కూడా హిట్టవ్వడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నాడు హీరో మహేష్ బాబు. ఈ సందర్భంగా ఫ్యాన్స్, ఆడియన్స్ కు కృతజ్ఞతలు తెలిపాడు.

Mahesh Babu | రీ-రిలీజెస్ పై స్పందించిన మహేష్ బాబు
X

ఒకప్పుడు పెద్ద హీరోల సినిమాలు మళ్లీ మళ్లీ రిలీజ్ అయ్యేవి. రానురాను ఆ కల్చర్ పోయింది. మరోసారి రిలీజ్ చేసిన జనాలు చూస్తారనే గ్యారెంటీ లేదు. ఎందుకంటే, లెక్కలేనన్ని సార్లు టీవీల్లో వచ్చేస్తోంది. ఓటీటీలో ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంటోంది.

ఈ నేపథ్యంలో, ధైర్యం చేసి పోకిరి సినిమా రిలీజ్ చేశారు మహేష్ అభిమానులు. కట్ చేస్తే, ఆ సినిమా పెద్ద హిట్టయింది. తాజాగా బిజినెస్ మేన్ రిలీజ్ చేస్తే, రీ-రిలీజ్ లో కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఈ ట్రెండ్ పై మహేష్ స్పందించాడు. ఫ్యాన్స్ కు థ్యాంక్స్ చెప్పాడు.

"రీ-రిలీజ్ కల్చర్ మళ్లీ స్టార్ట్ అవ్వడం హ్యాపీగా ఉంది. పోకిరి నుంచి ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది. పోకిరి వసూళ్లను ఛారిటీకి ఉపయోగించాం. ఆ తర్వాత మోసగాళ్లకు మోసగాడు, తాజాగా బిజినెస్ మేన్ రిలీజ్ అయ్యాయి. అన్నింటికీ ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫ్యాన్స్ అభిమానాన్ని మాటల్లో వర్ణించలేను. రీ-రిలీజ్ లో కూడా నా సినిమాల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు."

మహేష్ స్టార్ట్ చేసిన ఈ ట్రెండ్ ను ఇప్పుడు చాలామంది హీరోలు ఫాలో అవుతున్నారు. దాదాపు పెద్ద హీరోల సినిమాలన్నీ రీ-రిలీజ్ అవుతున్నాయి. అయితే ఇలా రీ-రిలీజ్ అవుతున్న సినిమాల్లో మహేష్, పవన్ కల్యాణ్ మూవీస్ మాత్రమే చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లు సాధిస్తున్నాయి.

First Published:  21 Aug 2023 4:07 AM GMT
Next Story