Telugu Global
Cinema & Entertainment

Magadheera | మగధీర రీ-రిలీజ్

Magadheera - రామ్ చరణ్ కు తిరుగులేని క్రేజ్ తీసుకొచ్చిన సినిమా మగధీర. ఇప్పుడీ సినిమా మరోసారి థియేటర్లలోకి వస్తోంది.

Magadheera | మగధీర రీ-రిలీజ్
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరికీ ఒక రోజు ముందే పండగ రాబోతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి తెలుగు వాడి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మగధీర సినిమా రీ-రిలీజ్ కాబోతోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాను రాజమౌళి డైరక్ట్ చేశాడు.

ఈ మెగా బ్లాక్ బస్టర్ మూవీని చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 26న థియేటర్లలో రీ-రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా పంపిణీదారులు శ్రీ విజయలక్ష్మి ట్రేడర్స్ అధినేత యర్రంశెట్టి రామారావు, అరిగెల కిషోర్ బాబు మాట్లాడుతూ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో అత్యధిక థియేటర్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రీ-రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

గతేడాది నుంచి రీ-రిలీజ్ ట్రెండ్ ఊపందుకుంది. సరిగ్గా అదే టైమ్ లో మగధీర సినిమాను రీ-రిలీజ్ చేయాలంటూ మెగాభిమానులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎట్టకేలకు వాళ్ల కోరిక నెరవేరింది. మగధీర సినిమా మరోసారి థియేటర్లలోకి వస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు ట్రయిలర్ రిలీజ్ చేసి, అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ చేస్తారు.

రాజమౌళి డైరక్ట్ చేసిన ఈ సినిమాతో రామ్ చరణ్ స్టార్ అయిపోయాడు. ఇదే మూవీతో కాజల్ కూడా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. దివంగత శ్రీహరి ఈ సినిమాలో కీలక పాత్ర పోషించగా.. కీరవాణి సంగీతం అందించారు.

First Published:  18 March 2024 5:32 PM GMT
Next Story