Telugu Global
Cinema & Entertainment

కీడాకోలా మొదలైంది

ఎట్టకేలకు దర్శకుడు తరుణ్ భాస్కర్ నుంచి మరో సినిమా రాబోతోంది. ఈ నగరానికి ఏమైంది సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు కీడాకోలా అనే సినిమాను లాంచ్ చేశాడు

కీడాకోలా మొదలైంది
X

యంగ్ అండ్ ట్యాలెంటడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో వచ్చిన పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది.. రెండూ పెద్ద విజయాలు సాధించాయి. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాలను తీయడంలో దిట్ట అనిపించుకున్న తరుణ్ భాస్కర్ ఈసారి సరికొత్త క్రైమ్ కామెడీ మూవీ 'కీడా కోలా' ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు.

దీనికి సంబంధించి ఇప్పటికే టైటిల్ పోస్టర్ ను, ప్రీ-లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశాడు తరుణ్ భాస్కర్. ఇప్పుడీ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు.

విజి సైన్మా బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 1 గా రాబోతున్న ఈ చిత్రం రామానాయుడు స్టుడియోస్ లో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈవెంట్ కి నిర్మాత సురేష్ బాబు, హీరోలు సిద్ధార్థ్, తేజ సజ్జా, నందు, పలువురు యువ దర్శకులు హాజరయ్యారు. త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.

కీడా కోలా సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తీస్తున్నాడు తరుణ్ భాస్కర్. ఈ సబ్జెక్టుకు భాషతో సంబంధం లేదంటున్నాడు. నటీనటుల వివరాలతో త్వరలోనే మరోసారి మీడియాను కలుస్తానని వెల్లడించాడు. వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

First Published:  24 Aug 2022 3:15 AM GMT
Next Story