Telugu Global
Cinema & Entertainment

కార్తికేయ టీమ్ కు అరుదైన గౌరవం

కార్తికేయ-2 యూనిట్ అరుదైన ఆహ్వానాన్ని అందుకుంది. బృందావనంకు రావాల్సిందిగా ఈ సినిమా యూనిట్ ను ఇస్కాన్ ఆహ్వానించింది.

కార్తికేయ టీమ్ కు అరుదైన గౌరవం
X

కార్తికేయ-2 సినిమాతో త్వరలోనే థియేటర్లలోకి రాబోతోంది నిఖిల్ అండ్ టీమ్. ఇప్పుడీ సినిమా యూనిట్ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. శ్రీకృష్ణుడు రిఫరెన్స్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ఇస్కాన్ నుంచి ఆహ్వానం అందింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కృష్ణ భక్తుల్ని ఒక్కటిచేసే సంస్థగా ఇస్కాన్ గుర్తింపు పొందింది. ఇప్పుడీ ఆర్గనైజేషన్ నుంచి కార్తికేయ-2 టీమ్ కు ఆహ్వానం అందింది.

ఈ సినిమా ఎలా మొదలైంది.. కృష్ణుడు, ద్వారకకు సంబంధించి ఏం చెప్పబోతున్నారు.. ఈ సినిమా నిర్మాణానికి కృష్ణుడు ఎలా స్ఫూర్తిగా నిలిచాడు లాంటి వివరాల్ని తమతో పంచుకోవాల్సిందిగా కోరింది. దీంతో యూనిట్ లోని కీలక సభ్యులు ద్వారక బయల్దేరి వెళ్తారు. రేపు బృందావనంలో కార్తికేయ-2కు సంబంధించిన అన్ని భాషల టీజర్లను ప్రదర్శించబోతున్నారు. అంతేకాదు, అక్కడే సినిమా కొత్త విడుదల తేదీని కూడా ప్రకటించబోతున్నారు.

సముద్రం దాచుకున్న అతిపెద్ద రహస్యం.. ఈ ద్వారకా నగరం అంటూ హీరో నిఖిల్ వాయిస్ తో ఇప్పటికే వచ్చిన మోషన్ పోస్టర్ అందర్లో ఆసక్తి రేపింది. దాన్ని కొనసాగిస్తూ వచ్చిన ఫస్ట్ ట్రయిలర్ మరింత ఆసక్తికరంగా సాగింది. డాక్ట‌ర్ కార్తికేయ ప్ర‌యాణం... శ్రీకృష్ణుడు చ‌రిత్ర‌లోకి ఎంట‌ర‌వుతున్న కార్తికేయను ట్రయిలర్ లో చూపించారు. అలా ఈ చిత్రంలోని కృష్ణ భావాన్ని ట్రైలర్ లో చూపించారు. దీంతో ఆ అనుభవాల్ని తమతో పంచుకోవాలంటూ ఇస్కాన్ నుంచి కార్తికేయ-2 యూనిట్ కు ఆహ్వానం అందింది.

ఊహించని విధంగా ఇస్కాన్ నుంచి వచ్చిన ఈ ఆహ్వానానికి యూనిట్ ఉబ్బితబ్బిబ్బవుతోంది. ప్రస్తుతం హీరో నిఖిల్ తో పాటు పీపుల్ మీడియా నిర్మాతలు ఈ సినిమా విడుదల తేదీపై చర్చలు జరుపుతున్నారు. ఈనెల 29, జులై 5, జులై 12 తేదీల్లో ఏ తేదీకి వస్తే బాగుంటుందనే అంశంపై డిస్కషన్ చేస్తున్నారు. ఈరోజు నిర్ణయించిన తేదీని, రేపు బృందావనం వేదికగా ప్రకటిస్తారు.



First Published:  18 July 2022 7:00 AM GMT
Next Story