Telugu Global
Cinema & Entertainment

కార్తికేయ 2 థియేట్రికల్ ట్రయిలర్ రివ్యూ

నిఖిల్ హీరోగా నటించిన సినిమా కార్తికేయ-2. ఈరోజు ఈ సినిమా నుంచి థియేట్రికల్ ట్రయిలర్ రిలీజైంది.

కార్తికేయ 2 థియేట్రికల్ ట్రయిలర్ రివ్యూ
X

సీతారామం, బింబిసార అనే రెండు సినిమాలూ హిట్టయ్యాయి. దీనికి కారణం ఆ సినిమాల్లో ఉన్న కంటెంట్ క్లిక్ అవ్వడమే. ఇదే లెక్కన చూసుకుంటే, హిట్టయ్యే కంటెంట్ తో వస్తున్న మరో సినిమా కార్తికేయ-2. ఈ సినిమాలో కంటెంట్ ఎలా ఉండబోతోందనే విషయం ఈరోజు అందరికీ క్లారిటీ వచ్చింది. ఎందుకంటే కార్తికేయ-2 థియేట్రికల్ ట్రయిలర్ రిలీజైంది.

చూపుతిప్పుకోనివ్వని విజువల్స్, అద్భుతమైన గ్రాఫిక్స్, స్టన్నింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కార్తికేయ-2 ట్రయిలర్ లో మేజర్ హైలెట్స్. ఈ టెక్నికల్ ఎలిమెంట్స్ తో పాటు సినిమాలో కంటెంట్ కూడా పుష్కలంగా ఉందనే విషయాన్ని ట్రయిలర్ లో చూపించారు. కృష్ణుడి ద్వారక నుంచి మొదలుపెట్టి కృష్ణతత్వాన్ని చాటిచెప్పే విధంగా మిస్టిక్ థ్రిల్లర్ గా కార్తికేయ-2 సినిమా ఉండబోతోందనే విషయం ట్రయిలర్ చూస్తే అర్థమౌతోంది.

ట్రయిలర్ లో దాదాపు అన్ని పాత్రల్ని చూపించారు. కార్తికేయలో నిఖిల్ పాత్ర ఎలా ఉంటుందో, దాదాపు అదే తీరుతెన్నుల్ని సీక్వెల్ లో కూడా చూపించారు. పార్ట్-1లో ఉన్న హీరోయిన్ స్వాతి పాత్రను కట్ చేసి, సీక్వెల్ లో అనుపమ పరమేశ్వరన్ కోసం కొత్త పాత్రను క్రియేట్ చేశారు.

ఇంతకుముందే చెప్పుకున్నట్టు టెక్నికల్ గా కార్తికేయ-2 ట్రయిలర్ అదిరింది. కచ్చితంగా ఈ సినిమాను థియేటర్లలో మాత్రమే, బిగ్ స్క్రీన్ పై చూడాలనే ఆసక్తిని రేకెత్తించింది. 13న పాన్ ఇండియా లెవెల్లో థియేటర్లలోకి వస్తోంది కార్తికేయ-2



First Published:  6 Aug 2022 2:50 PM GMT
Next Story