Telugu Global
Cinema & Entertainment

Karthi Japan: జపాన్ గా మారిన కార్తి

Karthi Japan movie: మొన్ననే మూవీ లాంఛ్ చేశాడు కార్తీ. అంతలోనే ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశాడు. జపాన్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది

Karthi Japan: జపాన్ గా మారిన కార్తి
X

కార్తి హీరోగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'జపాన్'. రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. కార్తికి ఇది 25వ సినిమా.


తాజాగా 'జపాన్' ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. టైటిల్ కి తగ్గట్టే ఫస్ట్ లుక్ చాలా క్రేజీ గా ఉంది. ఫస్ట్ లుక్ లో కార్తీ చేతిలో బాటిల్ పట్టుకొని, రెడ్ కలర్ జంప్ సూట్ లో సోఫాలో నిద్రపోతున్నట్లు కనిపించాడు. కార్తి ఎదురుగా మందు గ్లాస్ తో సేదతీరున్న ఓ అమ్మాయిని కూడా గమనించవచ్చు.


ఇక సోఫా వెనుక గోడపై పెద్ద గోల్డెన్ ఫ్రేమ్ లో మరొక డిఫరెంట్ గెటప్ లో కనిపించారు కార్తి. బంగారు చొక్కా, మెడలో గొలుసులను ధరించి, ఒక చేతిలో బంగారు తుపాకీని మరో చేతిలో గోల్డెన్ గ్లోబ్ ని పట్టుకున్నట్లుగా కనిపించడం ఆసక్తి రేకెత్తిస్తోంది.


ఈ చిత్రంలో తొలిసారిగా కార్తి సరసన అను ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. అల్లు అర్జున్ 'పుష్ప'లో 'మంగళం శీను' పాత్రలో ఆకట్టుకున్న సునీల్ 'జపాన్'లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంతో సునీల్, కోలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.




First Published:  15 Nov 2022 11:45 AM GMT
Next Story