Telugu Global
Cinema & Entertainment

Sivakarthikeyan - డిఫరెంట్ కాంబో కలిసింది

Sivakarthikeyan Sai Pallavi - శివకార్తికేయన్, సాయిపల్లవి కొత్త సినిమా సెట్స్ పైకి వచ్చింది. కమల్ హాసన్ దీనికి నిర్మాత.

Sivakarthikeyan - డిఫరెంట్ కాంబో కలిసింది
X

కొన్ని కాంబినేషన్లు ఇట్టే ఆకర్షిస్తాయి. అలాంటిదే ఇది కూడా. నిన్న ఓ ప్రాజెక్టు సెట్స్ పైకి వచ్చింది. హీరో శివకార్తికేయన్. నిర్మాత కమల్ హాసన్, హీరోయిన్ సాయిపల్లవి. వీళ్లు ముగ్గురు కలిశారు, సినిమా స్టార్ట్ చేశారు. అందుకే ఈ ప్రాజెక్టు క్రేజీగా మారింది.

కమల్ హాసన్ కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ కలయికలో శివకార్తికేయన్ హీరోగా సినిమా సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని కమల్ హాసన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, మహేంద్రన్ నిర్మించనున్నారు.

రాజ్ కుమార్ పెరియసామి ఈ సినిమాకు దర్శకుడు. దేశభక్తి కథాంశంతో రూపొందనున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో శివకార్తికేయన్‌ కు జోడిగా సాయి పల్లవి కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ కశ్మీర్‌ లోని అద్భుతమైన లొకేషన్లలో 2 నెలల షెడ్యూల్‌తో ప్రారంభమైంది.

ఈ చిత్రానికి జి వి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. కమల్ హాసన్ కు నిర్మాతగా ఇది 51వ చిత్రం. ఆయన నిర్మించిన గత చిత్రం విక్రమ్. దేశవ్యాప్తంగా అది పెద్ద హిట్టయిన సంగతి తెలిసిందే.

First Published:  6 May 2023 2:44 AM GMT
Next Story